2016 నవంబర్ 8 రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవినీతి - నల్లధనం నిర్మూలన కోసం పెద్ద నోట్లు రూ.500 - రూ. 1000 లను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. పెద్ద నోట్లు రద్దై సంవత్సరం అవనున్న సందర్భంగా...ఆ రోజు ఏ విధంగా నిర్వహించాలనే దానిపై ఇప్పుడు అధికార - ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కాంగ్రెస్ - తృణముల్ కాంగ్రెస్ - లెఫ్ట్.. లాంటి మొత్తం 18 ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి నవంబర్ 8ని బ్లాక్ డే(చీకటి దినం)గా జరపుకోవాలని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ రోజు నిరసన కార్యక్రమాలు - ర్యాలీలతో పెద్ద నోట్ల రద్దు వల్ల దేశంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం - నోట్ల కొరత లాంటి అంశాలను లేవనెత్తాలని ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయి. దీంతో...వచ్చే నవంబర్ 8ని యాంటీ బ్లాక్ మనీ డేగా నిర్వహించనున్నట్లు బీజేపీ అగ్రనేత - కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు.
నోట్ల రద్దు వైఫల్యాలు - జీఎస్ టీ అమలుపై దేశవ్యాప్తంగా ఆందోళనలకు విపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. హిమాచల్ ఎన్నికలకు ఒక రోజు ముందు నవంబరు 8వ తేదీనాడు దేశ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చాయి. దీనికి సంబంధించి వివరాలను ఢిల్లీలోని కాస్టిట్యూషన్ క్లబ్ లో కాంగ్రెస్ రాజ్యసభ పక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ - టిఎంసి సీనియర్ నాయకుడు డెరెక్ ఓబ్రెయిన్ - జెడి(యు) బహిష్కృత నేత శరద్ యాదవ్ విలేఖరులతో మాట్లాడారు. గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ సామాన్యుడిపై ఇప్పటికీ నోట్లరద్దు ప్రభావం పడుతూనే ఉందని అన్నారు. పెద్దనోట్లను రద్దుచేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన అనంతరం డబ్బుకోసం క్యూ లైన్లలో నిలబడి ఎంతోమంది చనిపోవడంతో, నెలలోగానే కేంద్రం నిబంధనలను సవరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కేంద్ర తీసుకున్న నిర్ణయం వల్ల నల్లధనం తగ్గకపోగా - 2శాతం జిడిపి తగ్గిపోయిందని - అలాగే దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరిగిందని ఆయన మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఉన్న 18 విపక్ష పార్టీలతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యులతో కూడిన సమన్వయ కమిటీ సమావేశంలో ప్రతిపక్ష పార్టీల నేతృత్వంలో నవంబరు 8న దేశవ్యాప్తంగా బ్లాక్ డే నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు.
దీంతో ప్రతిపక్షాలకు దీటుగా సమాధానం చెప్పడం కోసం నవంబర్ 8ని యాంటీ బ్లాక్ మనీ డేగా నిర్ణయిస్తూ బీజేపీ శ్రేణులంతా ఆరోజు వేడుకలు చేసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ``పెద్ద నోట్ల రద్దు ఉద్దేశాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకోలేదు. ఇదివరకు అక్రమ మార్గాల్లో తరలిపోయే డబ్బు.. ఇప్పుడు బ్యాంకుల్లో డిపాజిట్ అవుతున్నది. దీని వల్ల చట్టపరంగా పన్ను కట్టాల్సి ఉంటుంది. ఇదే డీమానెటైజేషన్ ఉద్దేశం. దీనిని కాంగ్రెస్ వేరే విధంగా అర్థం చేసుకొని లేని పోని వదంతులు సృష్టిస్తున్నది. డీమానెటైజేషన్ తర్వాత ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలన్నీ నెరవేరాయి. మంత్రులు దేశమంతా తిరిగి డీమానెటైజేషన్ - జీఎస్టీ వల్ల కలిగిన ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తారు. డీమానెటైజేషన్ చాలా మందిని టాక్స్ గ్రూప్ లోకి తీసుకొచ్చింది. టాక్స్ పేయర్స్ పరిధిని విస్తరించి.. డిజటల్ లావాదేవీలను పెంచి.. డబ్బు లావాదేవీలను తగ్గించడంలో డీమానెటైజేషన్ ప్రముఖ పాత్ర పోషించింది``అంటూ అరుణ్ జైట్లీ ఈ సందర్భంగా వెల్లడించారు.
పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు ఆందోళన నిర్వహించేందుకు సమాయత్తం అవుతుండగా...మరోవైపు పెద్దనోట్ల రద్దుకు అనుకూలంగా నవంబర్ 8ని యాంటీ బ్లాక్ మనీ డేగా నిర్వహించాలని బీజేపీ శ్రేణులకుఅరుణ్ జైట్లీ పిలుపునివ్వడంతో నవంబర్ 8వ తేదీ కీలక పరిణామాలకు వేదికగా మారిందంటున్నారు.