అధికార కమలానికి అంతా అనుకూలత ఎక్కడా కనిపించడం లేదట.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాజస్థాన్ లో తేడా కొట్టిందని ఇప్పుడు బీజేపీ కమలదళం లోలోపల కుమిలిపోతుందట.. తాజాగా ఎగ్జిట్ పోల్స్ లో రాజస్థాన్ లో బీజేపీకి ఓటమి తప్పదని చాలా సర్వేలు నిగ్గుతేల్చాయి. ఎన్టీటీవీ అయితే బీజేపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుందని తేల్చేసింది. కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీకి కాస్త ఊరటనిచ్చాయి. అయితే ఓవరాల్ గా మాత్రం బీజేపీనుంచి రాజస్థాన్ చేజారడం ఖాయమని తేలిపోయింది.
రాజస్థాన్ లో ప్రతి ఐదేళ్లకు అధికారం చేతులు మారుతుంటుంది. 5 ఏళ్లు పాలించగానే ఆ పార్టీని గద్దెదించేయడం రాజస్థానీలకు బాగా అలవాటు. గడిచిన సారి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను అందుకే చిత్తుచిత్తుగా ఓడించారు. ఇప్పుడు బీజేపీని అంత చిత్తుగా ఓడించరని.. కానీ ఓటమి ఖాయమని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి..
ఇక మధ్యప్రదేశ్ లో ఎగ్జిట్ పోల్స్ ఎటూ తేల్చలేదు.. బీజేపీకి - కాంగ్రెస్ కు సమాన స్థాయిలో సీట్లు వస్తాయని తేల్చాయి. మెజారిటీకి దరిదాపుల్లో రెండు పార్టీలు ఉండడంతో ఇక్కడ హంగ్ వస్తుందా..? ఏ పార్టీ గెలుస్తుందనేది సస్పెన్స్ గా మారింది..
ఇక చత్తీస్ ఘడ్ లో కూడా సర్వేలు ఏ పార్టీకి విజయాన్ని కట్టబెట్టలేదు. కొందరు బీజేపీకి - మరికొందరు కాంగ్రెస్ కు పట్టం కట్టారు. విజయం రెండు పార్టీల మధ్య దోబూచులాడుతోందని తెలిపారు.
ప్రస్తుత పరిస్థితిని బట్టి రాజస్థాన్ లో బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోందని.. మధ్యప్రదేశ్ - చత్తీస్ ఘడ్ లలో బీజేపీకి మెజారిటీ సాధిస్తే అదే పదివేలు అని కమలదళం భావిస్తోందట.. ఈ రెండు రాష్ట్రాలతో పరువు నిలుపుకొని రేపటి సార్వత్రిక ఎన్నికలకు ఆత్మవిశ్వాసంతో వెళ్లాలని ప్లాన్ చేస్తోందట.. ఒకవేళ మధ్యప్రదేశ్ - చత్తీస్ ఘడ్ లలో కూడా కాంగ్రెస్ గెలిస్తే బీజేపీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టేనని విశ్లేషకులు చెబుతున్నారు. చూడాలి మరి ఓటర్లు కమలానికి షాకిస్తారా.? ఆదరిస్తారా అనేది..