ఏపీ సర్కారు మీద హైకోర్టుకు ‘సాక్షి’

Update: 2016-06-15 08:03 GMT
ముద్రగడ దీక్ష ఎపిసోడ్ తో ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి ఛానల్ ప్రసారాలపై ఏపీ సర్కారు బంద్ చేయించిన సంగతి తెలిసిందే. భావోద్వేగాల్ని రెచ్చగొట్టేలా సదరు ఛానల్ వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి. అయితే.. అలాంటిదేమీ లేదని.. కేవలం రాజకీయ లబ్థి కోసమే తమను ఇరుకున పెట్టేందుకు తమ ఛానల్ ప్రసారాల్ని నిలిపివేసినట్లుగా సదరు ఛానల్ వాదిస్తోంది.

ఇదిలా ఉండగా.. ఛానల్ ప్రసారాలపై సాక్షి కోర్టును ఆశ్రయించింది. తాజాగా సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలు చేశారు. తమ టీవీ ఛానల్ ప్రసారాల్ని నిలిపివేస్తూ ఏపీ సర్కారు వ్యవహారశైలిపై ఫిర్యాదు చేసింది. సాక్షి ప్రసారాలకు అంతరాయం కలిగించేలా ఎంఎస్ వో లకు ప్రభుత్వ యంత్రాంగం అడ్గుతగలకుండా చూడాలంటూ హైకోర్టును రామచంద్రరావు ఆశ్రయించారు.

దీనికి సంబంధించిన ఒక పిటీషన్ ను హైకోర్టులో దాఖలు చేసిన ఆయన.. ఏపీ హోం శాఖ ముఖ్యకార్యదర్శి.. డీజీపీ.. కేంద్ర సమాచార కార్యదర్శి.. టెలికం రెగ్యులేటరీ అథారిటీ తదితరులతో పాటు.. ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టర్లు.. ఎంఎస్ వోలను కూడా ప్రతివాదులుగా చేర్చారు.సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఏపీ సర్కారు తీరు ఉందంటూ తమ పిటీషన్లో రామచంద్రమూర్తి తప్పు పట్టారు. మరి.. సాక్షి ప్రసారాల విషయంలో హైకోర్టు ఎలా స్పందిస్తుందో..?
Tags:    

Similar News