ఇటీవలే బీజేపీ కురువృద్ధుడు - మాజీ ప్రధాని వాజ్ పేయి మరణించారు. ఆయన మృతి బీజేపీకి తీరని లోటు. బీజేపీకి పెద్దదిక్కుగా ఉన్న ఆయన మరణాన్ని శ్రేణులందరూ గుర్తుపెట్టుకోవాలని బీజేపీ అధిష్టానం భావించింది..ఇందుకోసం వాజ్ పేయి చితాభస్మాన్ని బీజేపీ నేతలకు పంపింది. దేశంలోని అన్ని నదుల్లో భస్మాన్ని కలుపాలని నేతలకు సూచించింది. దీంతో ప్రతి రాష్ట్రంలో బీజేపీ నేతలు ఇప్పుడు ఇదే పనిలో బిజీగా ఉన్నారు.
తాజాగా వాజ్ పేయి అస్థికలను నిమజ్జనం చేసే విషయంలో యూపీలో బీజేపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు.. కొద్దిలో వీరు ప్రాణాలతో బతికిపోయారు. లేకుంటే పెద్ద విషాదమే జరిగి ఉండేది.
Full View
తాజాగా వాజ్ పేయి అస్థికలను నిమజ్జనం చేసే విషయంలో యూపీలో బీజేపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు.. కొద్దిలో వీరు ప్రాణాలతో బతికిపోయారు. లేకుంటే పెద్ద విషాదమే జరిగి ఉండేది.
ఉత్తరప్రదేశ్ లోని బస్తీ నదిలో వాజ్ పేయి అస్థికల నిమజ్జనం సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. యూపీ రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ రమాపాటి రామ్ త్రిపాఠి - ఎంపీ హరీష్ ద్వివేది - ఎమ్మెల్యే రామ్ చౌదరి - సీనియర్ బీజేపీ నేతలు అంతా కలిసి ఓ పడవలో నదిలోకి వెళ్లారు. నదిలో కలిపే సమయంలో అంతా చివరకు రావడంతో పడవ తలకిందులైంది. అయితే నది ఒడ్డునే ఇది జరగడం.. పోలీసులు అక్కడే ఉండడంతో వారంతా నదిలోకి దూకి నేతలందరినీ సురక్షితంగా రక్షించి బయటకు తీసుకొచ్చాడు. ఒడ్డునే కావడంతో ప్రాణప్రాయం తప్పింది.. లేకుంటే వాజ్ పేయి అస్థికల కార్యక్రమం పెద్ద విషాదంగా ముగిసి ఉండేది.