ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ ను ఓ రేంజ్లో చేపట్టిన అధికారపక్షం రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ తన ఆపరేషన్ ను మరింత ముమ్మరం చేసినట్లు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే వ్యూహాన్ని అమలు చేస్తున్నారో.. ఇంచుమించు అదే రీతిలో పావులు కదుపుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తాజాగా మరో విపక్ష నేతను సైకిల్ ఎక్కించేందుకు పచ్చజెండా ఊపేసినట్లు చెబుతున్నారు. అధికారికంగా ప్రకటించనప్పటికీ బాబు గూటికి వెళ్లటం మాత్రం ఖాయమని చెబుతున్నారు. తాజా జంపింగ్ విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీ సుజయకృష్ణగా చెబుతున్నారు.
తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఇందుకు తగ్గట్లే చోటు చేసుకుంటున్నాయి. ఏపీ అధికారపక్షంలో తాను భాగస్వామిని అయితే తనకు మంత్రి పదవి రావటం ఖాయమన్న మాటను తనకు సన్నిహితులైన నేతలు.. కార్యకర్తలతో సుజయ్ స్వయంగా చెప్పినట్లుగా చెబుతున్నారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలంటే పార్టీ మారక తప్పదన్న ఆలోచనను తన క్యాడర్ కు చెప్పినట్లుగా తెలుస్తోంది. తాను కానీ పార్టీ మారితే తనకు మంత్రి పదవితో పాటు.. మరికొన్ని పదవులు క్యాడర్ కు దక్కే అవకాశం ఉందంటున్నారు.
అధికారిక కన్ఫర్మేషన్ మినహా లోగుట్టుగా జరగాల్సిన వ్యవహారాలన్నీ పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. సో.. జగన్ గూటి నుంచి మరో ఎమ్మెల్యే వెళ్లిపోవటం ఖాయమన్నది తేలిపోయినట్లే. సుజయ్ కానీ సైకిల్ ఎక్కితే 14 మంది ఎమ్మెల్యేలు పార్టీలో మారినట్లు అవుతుంది.