మరో ఆత్మకథ పుస్తక రూపంలో వచ్చేసింది. మిగిలిన రంగాల వారికి సంబంధించిన ఆత్మకథలకు.. రాజకీయ నాయకుల ఆత్మకథలకు మధ్య చాలానే అంతరం ఉంటుంది. రాజకీయ నాయకులు నిజాయితీగా తమ ఆత్మకథను రాసిన పక్షంలో.. చరిత్రకు సంబంధించిన పలు మార్పులు చేర్పులు.. లేదంటే అంశాల్ని రికార్డు చేయాల్సి ఉంటుంది. తమకు తెలిసినప్పటికీ చాలా విషయాల్ని బయటకు చెప్పకుండా ఉండటం.. గుట్టుగా వ్యవహరించటం చేస్తుంటారు. ఆత్మకథ పుస్తకం లాంటి వేదికల్లో చాలావరకూ తమకు తెలిసిన విషయాల్ని చెప్పుకునే వీలు ఉంటుంది.
ఇప్పటివరకూ వచ్చిన ఆత్మకథలు.. పుస్తకాల్ని చూసినప్పుడు దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మధ్య సత్ సంబంధాలు లేవని.. పీవీ పొడ అంటే సోనియాకు గిట్టదని.. ఆ ఆగ్రహమే.. పీవీని దూరంగా ఉంచటమే కాదు.. ఆయన చనిపోయిన తర్వాత పార్టీ కార్యాలయంలోకి కూడా తీసుకురానివ్వకుండా చేశారనటం తెలిసిందే.
పీవీని అంతగా అవమానించిందని ఆరోపించిన వారంతా.. సోనియాగాంధీ మరీ అంత కఠినంగా.. దుర్మార్గంగా ఎందుకు వ్యవహరించారు?.. వారిద్దరి మధ్య గొడవకు.. మరీ అంతగా వ్యతిరేకించటానికి అసలు కారణం ఏమిటి? లాంటి ప్రశ్నలు వేస్తే సూటిగా.. స్పష్టంగా సమాధానం చెప్పే వారు కనిపించరు. ఒకవేళ చెప్పినా పీవీ కోణంలో చెప్పే వారే కానీ.. సోనియా కోణంలో చెప్పే వారు కనిపించరు. ఇప్పటివరకూ ఉన్న ఆ లోటును తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మార్గరేట్ అల్వా భర్తీ చేశారని చెప్పాలి. తాజాగా ఆమె ‘‘కరేజ్ అండ్ కమిట్ మెంట్’’ పేరిట తన ఆత్మకథను పుస్తక రూపంలో అచ్చేయించారు. పీవీ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన ఆమె.. సోనియాకు.. పీవీకి మధ్య గొడవ ఎక్కడ మొదలైంది? పీవీని సోనియా అంతగా వ్యతిరేకించారు? లాంటి ప్రశ్నలకు స్పష్టంగా సమాధానాలు ఇచ్చారు.
పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు 1992లో బోఫోర్స్ కేసులో పోలీసు ఫిర్యాదును కొట్టి వేస్తూ.. ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే.. ఈ ఉత్తర్వుల మీద సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయాలని నాడు ప్రధానిగా ఉన్న పీవీ డిసైడ్ చేయటమే సోనియాకు మంటపుట్టేలా చేసిందని సదరు పుస్తకం పేర్కొంది. సిబ్బంది వ్యవహారాల శాఖను చూస్తున్న మార్గరెట్ అల్వాను సోనియా పిలపించుకొని.. బోఫోర్స్ విషయంపై పీవీ సర్కారు నిర్ణయాన్ని ఆరా తీసినట్లుగా వెల్లడించారు. అయితే.. అప్పీలు విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని సోనియాకు స్పష్టం చేసినట్లు పేర్కొంటూ.. ‘‘ప్రధాని కార్యాలయం నుంచే ఈ ఆదేశాలు వెళ్లాయి. నాకు ఎలాంటి సంబంధం లేదు’’ అని చెప్పినట్లుగా పేర్కొన్నారు.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సోనియాగాంధీ.. ‘‘ప్రధాని ఏం చేయాలనుకుంటున్నారు. నన్ను జైలుకు పంపాలనుకుంటున్నారా? పీవీ సర్కారు నా కోసం ఏం చేసింది? ఈ ఇంటిని చంద్రశేఖర్ ప్రభుత్వమే కేటాయించింది. నా కోసం కానీ నా పిల్లల కోసం కానీ ఎలాంటి ప్రయోజనాల్ని ఆయన నుంచి కోరటం లేదు’’ అని తీవ్రస్థాయిలో తన వద్ద ఫైర్ అయినట్లుగా అల్వా ఆత్మకథలో పేర్కొన్నారు. పీవీతో ఆమెకు పడకపోవటానికి మరిన్ని కారణాలు చెబుతూ.. ‘‘ఆయన్ను ఎంతమాత్రం నమ్మినట్లుగా కనిపించలేదు. రాజీవ్ గాంధీ హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక వేత్త (తాంత్రికుడు అని అప్పట్లో మీడియా పేర్కొనేది) చంద్రస్వామితో పీవీ క్లోజ్ గా మూవ్ కావటం ఒక కారణం. ప్రధానికి దూరంగా ఉంటూ ఆయన్ను బలహీనుడ్ని చేయాలని ఆమె ఎప్పుడూ అనుకునే వారు. బాబ్రీ ఘటన.. తర్వాత కాలంలో బోఫోర్స్ ఇష్యూలో సుప్రీం అప్పీలు చేయటంతో ఇద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం.. అనుమానాలు మొదలయ్యాయి’’ అని ఆమె తన పుస్తకంలో వెల్లడించటం గమనార్హం.