హాని ట్రాప్ లో బాలీవుడ్ నటుడి భార్య అరెస్ట్.. కోట్ల నగదు స్వాధీనం

Update: 2021-11-22 05:30 GMT
హాని ట్రాప్.. ఈ దందా ఇప్పుడు మహానగరాల్లో మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది. బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారులను టార్గెట్ చేస్తూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న హనీ ట్రాప్ ముఠాను ముంబై క్రైమ్ బ్రాంచ్ పట్టుకుంది. అరెస్ట్ అయిన నిందితుల్లో ఒక మహిళ ఫ్యాషన్ డిజైనర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె 1990ల నాటి బాలీవుడ్ నటుడి భార్య స్వప్న అలియాస్ లుబ్నా వజీర్ అని సమాచారం.

లుబ్నా వజీర్ తోపాటు ఇద్దరు మగ మోడల్స్ ఈమెకు సహకరిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఫ్యాషన్ డిజైనర్ లుబ్నా వజీర్ అలియాస్ స్వప్నా ఇంటిపై పోలీసులు దాడి చేయగా.. రూ.29 లక్షల నగదు దొరికింది. దీంతోపాటు 7 మొబైల్ ఫోన్లు, 2 కార్లు, ఎనిమిది లక్షలకు పైగా విలువైన నగలు లభ్యమయ్యాయి.

లుబ్నా వజీర్ ముంబైలోని జుహు, బాంద్రా, లోఖండ్ వాలా నుంచి గోవా వరకూ కిట్టీ పార్టీలు, అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో చాలా మంది సంపన్నులతో స్నేహం చేస్తూ వారికి దగ్గరైంది. దీని తర్వాత హానీ ట్రాప్ చేసి లక్షలు, కోట్ల రూపాయలు దోచుకుంటోంది. ఈ పనిలో లుబ్నా గ్యాంగ్ మొత్తం ఉంది.

ఇందులో కొందరు మగ మోడల్స్, కొందరు ఆడ మోడల్స్ ప్రమేయం ఉందని సమాచారం. హనీ ట్రాప్ లో చిక్కుకొని లుబ్నా వజీర్ దోచుకున్న వారిని సంప్రదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

2016 నుంచి 2019 మధ్య మూడేళ్ల పాటు ఒక పారిశ్రామికవేత్తను ట్రాప్ చేశారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ కు చెందిన ఓ బడా పారిశ్రామికవేత్త వ్యాపారం నిమిత్తం ముంబైకి రాగా.. ప్లాన్ ప్రకారం ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో ఆయనను ట్రాప్ చేశారు. ముందుగా వ్యాపారం సాకుతో కలవడానికి వచ్చి ఆ తర్వాత హానీ ట్రాప్ చేస్తున్నట్టు గుర్తించారు.


Tags:    

Similar News