పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పాత కరెన్సీ పట్టుబడుతున్న విషయం తెలిసిందే. తాజాగా బెంగళూరులో భారీ మొత్తంలో పాత కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. పశ్చిమ బెంగళూరులోని బాంబ్ నాగ (వీ నాగరాజ్) అనే క్రిమినల్ ఇంట్లో రూ.25కోట్ల విలువైన పాత రూ.500, వెయ్యి నోట్లను పోలీసులు గుర్తించారు. పలు రాజకీయ హత్యలు, దోపిడీ కేసులతో సంబంధమున్న నాగరాజ్ నివాసంపై బెంగళూరు పోలీసులు దాడులు నిర్వహించగా ఇంత భారీ స్థాయిలో సొత్తు దొరికింది.
కాగా, నాగరాజ్ తన ఇంట్లో ఇనుప గేట్లు, తలుపులతో ఉన్న గదిలో కరెన్సీని దాచినట్లు పోలీసులు గుర్తించారు. లోహాలను కోసే నిపుణుల సాయంతో వాటిని కట్ చేసి కట్టలుగా ఉన్న పాత కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. క్రిమినల్ నాగరాజ్ ఇంట్లో లేని సమయంలో పోలీసులు ఆకస్మిక దాడులు చేపట్టారు. కరెన్సీని సీజ్ చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
మరోవైపు తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విజయ్‌భాస్కర్‌కు ఐటీ శాఖ మరోసారి సమన్లు జారీచేసింది. ఈ నెల 10న విజయ్‌భాస్కర్‌ను విచారించిన ఐటీ అధికారులు, మరోసారి విచారణకు హాజరుకావాల్సిందిగా సమన్లు జారీ చేశారు. తమిళనాడు ఆర్కే నగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న ఆరోపణల్లో ఐటీ అధికారులు మంత్రి విజయ్‌భాస్కర్ నివాసంలో ఈ నెల 7న సోదాలు నిర్వహించి, సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/