దుబాయి పోలీసుల అదుపులో బోనీ..పాస్‌ పోర్టు స్వాధీనం

Update: 2018-02-26 17:31 GMT
సినీ నటి శ్రీదేవి మృతిలో మరో కొత్త కోణం బయటపడినట్లు తెలుస్తోంది. మరణానికి ముందు ఓ నంబర్ కు ఆమె ఫోన్ నుంచి ఎక్కువ కాల్స్ వెళ్లినట్లు తెలుస్తోంది. దుబయి పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు బోనీ కపూర్ సహా ముగ్గురి నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు.  బోనీ ను మూడున్నర గంటల పాటు ప్రశ్నించారు. అంతేకాదు... కేసును అక్కడి పోలీసులు దుబయి యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ డిపార్టుమెంటుకు అప్పగించగా వారు బోనీకపూర్ ను అదుపులోకి తీసుకోవడంతో పాటు ఆయన పాస్ పోర్టును కూడా స్వాధీనం చేసుకున్నారు.

కాగా శ్రీదేవి మృతిపై యూఏఈ ఆరోగ్య శాఖ అధికారులు నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే.  ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడిందని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. ఆమె శరీరంలో ఆల్కాహాల్ గుర్తించినట్లు వెల్లడించారు.  అయితే..  అసలు శ్రీదేవి ఒక్కరే మద్యం తాగారా? ఎక్కడ తాగారు? ఎవరితో కలిసి తాగారు? బోనీ కపూర్ ముంబై వెళ్లి వచ్చారా, లేదా? ఆమెను ఎవరైనా తోసేశారా? మద్యం మత్తులో టబ్‌లో పడ్డారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
    
తొలుత శ్రీదేవి కుటుంబ సభ్యులు కొందరు కార్డియాక్ అరెస్ట్ అని ఎందుకు చెప్పారనే కీలక అనుమానం రేకెత్తుతోంది. మృతిపై అబద్దం ఎందుకు చెప్పారనే చర్చ సాగుతోంది. అంతేకాకుండా ఆమె ఆత్మహత్య చేసుకుందన్న ప్రచారం కూడా ఒకటి పెద్ద ఎత్తున సాగుతోంది.

ఖుష్బూ కోపం..

మరోవైపు శ్రీదేవి మరణం అనంతరం ఇండియాలో నేషనల్ మీడియా సరైన కవరేజ్ ఇవ్వలేదని తమిళ నటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ మండిపడ్డారు. ప్రాంతీయ వార్తా పత్రికల నుంచి బీబీసీ, స్కై న్యూస్‌ వంటి అంతర్జాతీయ పత్రికల వరకు శ్రీదేవి - ఆమె నటించిన సినిమాల గురించి ప్రధానంగా పేర్కొన్నాయి. కానీ, దేశ రాజధాని ఢిల్లీకి చెందిన వార్తా పత్రికల్లో మాత్రం అసలు శ్రీదేవి నటించిన తెలుగు - కన్నడ - మలయాళం - తమిళ సినిమాల జాడే కన్పించలేదని ఆమె మండిపడ్డారు.
Tags:    

Similar News