తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి చేతులెత్తేసిన జనసేన పార్టీ తెలంగాణ లోక్ సభ ఎన్నికల బరిలో దిగుతోంది. ఆ పార్టీ తన తొలి అభ్యర్థి ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్న జనసేనాని ఏపీలో అందరికంటే ముందే కొందరు అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. తాజాగా తెలంగాణలో లోక్ సభ అభ్యర్థుల జాబితా విడుదల మొదలుపెట్టారు.
జనసేన పార్టీ తెలంగాణలో తన తొలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించింది. ప్రముఖ వ్యాపారవేత్త - జనసేన పార్టీ వ్యవస్థాపక ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్ రెడ్డిని మల్కాజ్‌గిరి లోక్ సభ స్థానం జనసేన అభ్యర్ధిగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పవన్ మాజీ మిత్రుడు రేవంత్ రెడ్డి మీద ఈయన పోటీ చేయబోతున్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం విజయవాడ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో మహేందర్ రెడ్డి అభ్యర్ధిత్వాన్ని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.
మహేందర్ రెడ్డితో నాది రాజకీయ బంధమే కాదు... మంచి స్నేహం ఉంది. ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టకముందు నుంచి నాకు తెలుసు. కామన్ మాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో కూడా ఆయన ఉన్నారు. మెదక్ పార్లమెంట్ స్థానానికి పీఆర్పీ అభ్యర్థిగా నిలబడాల్సిన వ్యక్తి. ట్రాఫిక్ జాంలో చిక్కుకుని ఆనాడు ఆయన అవకాశం కోల్పోయారు. ఆయన విజయానికి పార్టీ కార్యకర్తలు, జన సైనికులు కృషి చేయాలి. మల్కాజ్ గిరి స్థానం నుంచి ఎంపీగా మహేందర్ రెడ్డి గెలవాలి అని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.