వైసీపీ నేతల మధ్య రాజకీయ చర్చలు కామనే. రాజకీయాల్లో ఉన్నవారికి ఇవి తప్ప ఇంకేముంటుంది. అయితే.. వ్యాపారాలు.. లేకుంటే రాజకీయాలే. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ దక్కించుకునే సీట్లు.. ఓట్లపై తరచుగా నాయకులు చర్చిస్తున్నారు. ఇటీవల రెండు కీలక నగరాలపై.. నాయకులు దృష్టి పెట్టారు. ఒకటి.. పాలనా రాజధాని చేస్తామని చెబుతున్న విశాఖనగరంపై, రెండు విజయవాడపైనా.. నాయకులు దృష్టి పెట్టారు.
2019 ఎన్నికల్లో విశాఖ నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. అయితే.. పార్లమెంటు స్థానం మాత్రం వైసీపీ దక్కించుకుంది. ఎంవీవీ సత్యనారాయణ ఇక్కడ నుంచి విజయం దక్కించుకున్నారు.
మరి వచ్చే ఎన్నికల పరిస్థితి ఏంటి? అనేది ప్రశ్న. ఎంపీగా.. ఎంవీవీ వివాదాలకు కేంద్రంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఆయన గెలుపు కష్టమని.. ఇప్పటికే.. పార్టీ అధిష్టానం కూడా నిర్ణయించుకుంది.
దీంతో వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఎంవీవీకే ఇస్తే.. ఓటమి తథ్యం. ఇక, నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పరిస్థితి అలానే ఉంది. కార్పొరేషన్ దక్కించుకున్నా.. అసెంబ్లీ నియోజకవర్గాలపై మాత్రం పట్టు సాధిం చలేక పోయారు. దీంతో ఈ నాలుగు నియోజకవర్గాలు వైసీపీకి దక్కే పరిస్థితి లేదని.. నాయకులు అంచనా వేస్తున్నారు.. పాలనా రాజధానిగా ప్రకటించాక కూడా.. ఇక్కడ ఊపు రాకపోవడంపై చర్చ జోరుగానే సాగు తోంది.
ఇక, విజయవాడ విషయానికి వస్తే.. నగరంలోమూడు నియోజకవర్గాలు ఉంటే.. రెండు చోట్ల గత ఎన్నికల్లో విజయం దక్కింది. సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల్లో వైసీపీ విజయం దక్కించుకుంది. అయితే.. వచ్చే ఎన్నికల్లో సెంట్రల్‌పై టీడీపీ బాగా దృష్టి పెట్టగా.. పశ్చిమపై జనసేన పట్టు బిగిస్తోంది.
దీంతో ఈ రెండు స్థానాలు పోయే ఛాన్స్ ఉంది. ఎటొచ్చీ.. తూర్పులో టీడీపీ అభ్యర్థి మారితే.. వైసీపీకి విజయం దక్కే ఛాన్స్ ఉంది. ఇక, ఎంపీ విషయానికి వస్తే.. వైసీపీకి అసలు అభ్యర్థే లేకపోవడం గమనార్హం. సో.. మొత్తంగా.. ఈ రెండు నగరాల్లో వైసీపీ జెండా ఎగరడం కష్టమనే అంటున్నారు పరిశీలకులు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.