విశాఖ రాజధానిగా జగన్ సర్కారు ముహుర్తం పెట్టేసిందా?

Update: 2021-01-03 04:51 GMT
ఏపీకి మూడు రాజధానులుగా జగన్ సర్కారు నిర్ణయం తీసుకోవటం.. దీనికి సంబంధించిన కసరత్తులు సాగుతుండటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఏపీ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను డిసైడ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనసులోని మాటను తాజాగా ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించటం ఆసక్తికరంగా మారింది. తాజాగా రామతీర్థంలో రాముడి విగ్రహాల ధ్వంసం పెను సంచలనంగా మారటం.. ఈ వ్యవహారం పెద్ద రగడగా మారుతునన వేళ.. బొత్స ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలుగు వారి కొత్త సంవత్సరమైన ఉగాది పండుగ నుంచి విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా మారుతుందని బొత్స వెల్లడించారు. దీనికి సంబంధించి చట్టపరమైన చర్యల్ని చేపట్టినట్లుగా చెబుతున్నారు. ఉగాది నుంచి ఏపీ పరిపాలనా రాజధానిగా విశాఖ కొనగనున్నట్లు చెప్పటం ద్వారా రాజధాని అంశంపై ఉన్న అస్పష్టతకుచెక్ చెప్పినట్లుగా చెప్పాలి. ఒకవేళ బొత్స మాటలే నిజమైతే.. ఏపీ పరిపాలనా రాజధానిగా విశాఖ మారనుందని చెప్పాలి.

ఇక.. రామతీర్థం పుణ్యక్షేత్రాన్ని తమ కుటుంబ సభ్యులే డెవలప్ చేసినట్లుగా బొత్స వెల్లడించారు. రామతీర్థం ఉదంతంలో కచ్ఛితంగా రాజకీయ కోణం ఉంటుందని.. రెండు మూడురోజుల్లోనే ఆ వివరాలు వెల్లడవుతాయని చెబుతున్నారు. ఆలయ ట్రస్టీగా వ్యవహరిస్తున్న అశోక్ గజపతిరాజు ఏమీ చేయలేదని విమర్శించారు. ఈ ఉదంతంలో దోషులకు కఠిన శిక్షలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.


Tags:    

Similar News