వివాహేతర సంబంధం నేపథ్యంలో.. ఈ నెల 15న బాపట్ల జిల్లాలో వాలంటీర్ హత్యకు గురైన విషయం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న పద్మారావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిడుబ్రోలు రైల్వే స్టేషన్లో రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నాడు.
వీరెవరు?
బాపట్ల జిల్లా వేమూరు మండలం చావలి గ్రామానికి చెందిన 27 ఏళ్ల శారద.. వలంటీర్‌గా పనిచేస్తోంది. అయితే.. ఆమె కొన్నాళ్లుగా పద్మారావు(35)తో వివాహేతర సంబంధంతో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళా వాలంటీర్ శారదను పద్మారావు.. ఇటీవల ఇంటి వద్ద హత్య చేశాడు. అనంతరం.. తాజాగా ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
నిడుబ్రోలు రైల్వే స్టేషన్లో.. రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నాడు. తిరుపతి నుంచి విశాఖ వెళ్తున్న డబుల్ డెక్కర్ రైలు కిందపడి పద్మారావు ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని, మృతదేహాన్ని కుటుంబసభ్యులు గుర్తించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
మొదట ఏం జరిగిందంటే
బాపట్ల జిల్లా, బాపట్ల మండలం చావలి గ్రామానికి చెందిన దొప్పలపూడి శారద(27) ఇంటర్ వరకు చదువుకుంది. ఆమెకు అదే గ్రామంలోని మేనమామ ధర్మారావుతో 2008లో వివాహం జరిగింది. శారద గత రెండేళ్లుగా స్థానికంగా వాలంటీర్‌గా పనిచేస్తోంది. అయితే.. చావలి గ్రామానికే చెందిన పద్మారావుతో శారదకు వివాహేతర సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. అయితే.. ఇటీవల కాలంలో శారద తనతో సరిగా మాట్లాడక పోవడం.. తన ఫోన్‌కు స్పందించకపోవడంతో పద్మారావు ఆమెపై అనుమానం పెంచుకున్నాడు.
ఈ క్రమంలోఆరు నెలల క్రితం గ్రామ సచివాలయం వద్ద ఆమెపై చేయిచేసుకున్నాడు. ఈ విషయమై అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది శారద. దీంతో.. పోలీసులు పద్మారావును మందలించారు. ఈ ఘటనతో శారదపై కక్ష పెంచుకున్న పద్మారావు.. ఈ నెల 15న ఆదివారం సాయంత్రం ఆమె ఇంటి ముందు వాకిలి శుభ్రం చేసుకుంటున్న సమయంలో వెళ్లి కత్తితో దాడిచేశాడు.
శారద తప్పించుకొని పారిపోతున్నా.. వెంబడించి మరీ మెడపై బలంగా పొడిచి.. అనంతరం పొట్టపైనా కత్తితో గాట్లు పెట్టాడు. దీంతో కడుపు నుంచి పేగులు బయటకు వచ్చాయి. దీంతో సమీపంలోని పొలంలో శారద కుప్పకూలి అక్కడికక్కడే శారద మృతి చెందింది. ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే.. పద్మారావు తాజాగా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వివాహేతర సంబంధాలు కొనసాగించడం ఎంత ప్రమాదకరమో స్పష్టం చేస్తోందని అంటున్నారు పోలీసులు.