బ్రేకింగ్ న్యూస్ : ఆ స్థలం హిందువులకే .. రామ మందిర నిర్మాణానికి అనుమతి.?

Update: 2019-11-09 06:29 GMT
దేశంలో అత్యంత సున్నిత మైన అయోధ్య లోని రామ జన్మ భూమి, బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదం పై దేశ సర్వోన్నత న్యాయ స్థానం శనివారం కీలక తీర్పు వెల్లడించింది. తీర్పు ని  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ చదివారు. నిర్ణయానికి ముందు రెండు మతాలను విశ్వాసాల ను పరిగణన లోకి తీసుకున్నట్టు తెలియ జేసారు. అలాగే ఈ తీర్పు పురావస్తు శాఖ నివేదికల ఆధారంగా వెలువరిస్తున్నట్టు తెలిపారు.

వివాదాస్పద స్థలం లో మందిరం ఉన్నట్టు పురావస్తు శాఖ నివేదికలు చెబుతున్నాయన్నారు. మసీదు నిర్మాణానికి ముందే ఆ స్థలం లో ఒక నిర్మాణం ఉందన్నారు. వివాదాస్పద స్థలం లో మసీదు లేదని, అక్కడ హిందూ నిర్మాణం ఉందని పురావస్తు శాఖ విభాగం చెబుతోంది అని చెప్పారు. అయోధ్య ను రామ జన్మ భూమిగా హిందువులు విశ్వసిస్తారని, మందిరాన్ని కూలగొట్టి మసీదు నిర్మించారని పురావస్తు శాఖ ఎక్కడా చెప్పలేదన్నారు.  మసీదు ఎవరు కట్టారో, ఎప్పుడు కట్టారో స్పష్టం కాలేదని హైకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.  

ఈ నేపథ్యంలో  వివాదాస్పదమైన అయోధ్య రామ జన్మ భూమి స్థలం హిందువుల కే చెందుతుందని సుప్రీం కోర్టు ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది. 1856 నుంచి హిందూ- ముస్లిం సంస్థల మధ్య వివాదాని కి కారణమైన 2.77 ఎకరాల స్థలాన్ని అయోధ్య చట్ట ప్రకారం ఏర్పాటు చేసే ఆలయ ట్రస్ట్‌ కు అప్పగించాలని, ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో అయోధ్య  ట్రస్ట్ మూడు నెలలో ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అలాగే అదే సమయం లో ముస్లిం మత విశ్వాసాలకు ప్రాధాన్యతనిస్తూ అయెధ్య లోనే ఐదెకరాల స్థలాన్ని మసీదు నిర్మాణానికి కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.అయితే మత విశ్వాసాల ఆధారంగా కాకుండా పురావస్తు శాఖ నివేదిక ప్రాతిపదికనే సుప్రీం ధర్మాసనం ఏక గ్రీవ తీర్పును వెలువరించినట్లు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ వెల్లడించారు.
Tags:    

Similar News