ఎంపీ రఘురామకృష్ణంరాజుకు గత శుక్రవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆయన విడుదల మాత్రం మరింత ఆలస్యం కానుంది. మరో నాలుగురోజుల వరకు రఘురామకృష్ణంరాజు వేచి ఉండక తప్పదని రఘురామ తరుఫు న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు.
సోమవారం న్యాయవాది లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. కోర్టు ఆదేశాలతో పూచీకత్తులు లక్ష రూపాయలతో పిటీషన్ ట్రయల్ కోర్టులో వేశామన్నారు.అయితే డిశ్చార్జి సమ్మరీ కావాలని న్యాయమూర్తి అడిగారని.. అయితే రఘురామ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడానికి మరో నాలుగు రోజులు సమయం పడుతుందని న్యాయవాది తెలిపారు.
దీంతో నాలుగు రోజుల తర్వాతనే మరోసారి సీఐడీ కోర్టులో పూచీకత్తు పిటీషన్ వేస్తామని న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు. అప్పటివరకు బెయిల్ పై విడుదల వీలుకాదని లక్ష్మీనారాయణ తెలిపారు.