ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ధనవంతులు.. శక్తివంతమైన వ్యక్తుల జాబితాను ప్రతి యేటా ఫోర్బ్స్ మ్యాగ్జిన్ ప్రకటిస్తూ ఉంటుంది. ప్రతి యేటా మాదిరిగానే ఈ యేటా కూడా ఫోర్భ్స్ తన జాబితాను ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ తరహాలోనే ఆసియాలోని అత్యంత ధనవంతుల జాబితాను యూకే కు చెందిన 'ఏషియన్ రిచ్ లిస్ట్' పేరుతో ప్రతి యేటా ప్రకటిస్తోంది.
ఈ నేపథ్యంలోనే 2022 సంవత్సరానికి సంబంధించిన జాబితాను 'ఏషియన్ రిచ్ లిస్ట్' విడులైంది. ఈ లిస్టులో ప్రవాసీ భారతీయుడు.. బ్రిటన్ నూతన ప్రధాని రుషి సునాక్.. అతని భార్య అక్షతా మూర్తి దంపతులు తొలిసారి చోటు సంపాదించుకున్నారు. 790 మిలియన్ పౌండ్ల సంపద( సుమారు 7వేల700 కోట్ల)తో రుషి సునాక్.. అక్షతా దంపతులు 17వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.
ఇక ఈ ఏడాదిలో ప్రకటించిన వారి జాబితాలోని ప్రముఖ సంపద మొత్తం 113.2 బిలియన్లకు చేరింది. గతేడాదితో పోలిస్తే వీరి సంపద 13.5 బిలియన్ల మేర పెరిగిందని 'ఏషియన్ రిచ్ లిస్ట్' పేర్కొంది. ఈ జాబితాలో మొదటి స్థానంలో హిందుజా కుటుంబం కొనసాగుతోంది. వరుసగా 8వ ఏడాది కూడా హిందుజా కుటుంబమే తొలి స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. వీరి సంపద 30.5 బిలియన్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వీరి సంపద మరో మూడు బిలియన్ల మేర పెరిగింది.
ఇక ఈ జాబితాలో లక్ష్మీ మిత్తల్.. ఆయన కుమారుడు ఆదిత్య 12.8 బిలియన్ల పౌండ్లతో.. నిర్మలా సేథియా 6.5 బిలియన్ డాలర్ల సంపాదతో చోటు సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన 24వ వార్షిక ఏషియన్ బిజినెస్ అవార్డుల కార్యక్రమంలో భాగంగా లండన్ మేయర్ సాధికన్ 'ఏషియన్ రిచ్ లిస్ట్-2022' ప్రతులను జాబితాలో చోటు సంపాదించుకున్న కుబేరులకు అందజేసి అభినందించారు.
ఈ కార్యక్రమంలో హిందుజా గ్రూప్ సహా చైర్మన్.. గోపీచంద్ హిందుజా కూమార్తె రితు చాబ్రియా పాల్గొని లండన్ గవర్నర్ చేతుల మీదుగా ప్రతులను అందుకున్నారు. అనంతరం గవర్నర్ సాదిఖ్ ఖాన్ మాట్లాడుతూ బ్రిటన్లో ఆసియా సంతతి ప్రతి యేటా అభివృద్ధి చెందుతుందనడానికి 'ఏసియన్ రిచ్ లిస్ట్-2022' జాబితానే నిదర్శనంగా నిలుస్తుందని ప్రసంసించారు. ఈ పరంపర ఇలాగే కొనసాగాలనే ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.