క‌రోనా క‌ల‌క‌లంలో మ‌గ‌బిడ్డ‌కు తండ్ర‌యిన బ్రిట‌న్ ప్ర‌ధాని

Update: 2020-04-29 15:30 GMT
క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న త‌రుణంలో...బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఊహించ‌ని వార్త‌తో తెర‌కెక్కారు. బోరిస్ జాన్సన్ కు నెల క్రితం కరోనా సోకగా ప్రమాదం అంచులకు వెళ్లారు. బోరీస్‌తో పాటు ఆయన భార్య కారీ సైమండ్స్‌కు కూడా వైరస్ సోకింది. అయితే ఆమె త్వరగా కోలుకోగా జాన్సన్ కోలుకోవడానికి సమయం పట్టింది. నెల రోజుల తర్వాత సోమవారం విదులకు బోరిస్ హాజరయ్యారు. బోరిస్ దంపతులకు బుధవారం మగ బిడ్డ పుట్టింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

బోరిస్ జాన్సన్ వ‌య‌సు 55 ఏళ్లు కాగా ఆయ‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ సైమండ్స్ వ‌య‌సు 32 ఏళ్లు. గ‌త ఏడాది ఈ ఇద్ద‌రూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కానీ వారు ఒక‌టిగా జీవిస్తున్నారు. అయితే ప్ర‌ధాని కార్యాల‌యం డౌనింగ్ స్ట్రీట్‌లోకి పెళ్లి కాకుండా అడుగుపెట్టిన తొలి జంట వీరిదే కావ‌డం విశేషం. ప్రస్తుతం వీరికి మొదటి బిడ్డ జన్మించింది. బోరీస్, కారీ దంపతుల ఇంట్లో ఆనందం వెల్లి విరిసిందంటూ ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి మట్ హకాక్ ట్విటర్‌లో అభినందనలు తెలిపారు.

జాన్సన్ మొదటి భార్య అయిన మారియా వీలర్ ఈ సంవత్సరంలోనే విడాకులు తీసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు. అయితే వీరు 2018లోనే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. బోరిస్ జాన్సన్ భార్య మెరీనా వీలర్ తల్లి దీప్కౌర్ భారతీయురాలు. ఆమె ప్రధాని నరేంద్ర మోడీకి బాగా పరిచయస్తురాలు కూడా. అందుకే తాను ఇండియాకు అల్లుడినని 55 ఏళ్ల జాన్సన్ తరచూ చెప్పుకొంటారు. ప్రధాని మోడీతో కూడా ఆయనకు మంచి పరిచయం ఉంది. అందుకే, పార్టీ నాయ‌క‌త్వం కోసం జరిగిన నెల రోజుల ప్రచారంలోఆయన భారత సంతతి నాయకులు, ప్రజల మనసులు గెలుచుకునే ప్రయత్నం చేశారు. ఇండియా, యూకే రెండు ఆధునిక ప్రజాస్వామ్య దేశాలని, రెండు దేశాలూ ఒకరి కొకరు సహకరించుకుని సవాళ్లను అధిగమించాలని తాను ప్రధాని మోడీతో భేటీలోచెప్పానన్నారు. ఇంతకుముందు మన దేశంపై బ్రిటన్ స్కాచ్ విస్కీ దిగుమతుల సుంకంపెంచడాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు.


Tags:    

Similar News