వీడియో: న్యూయార్క్ లో మరణ మృదంగం.. ట్రక్కుల్లోకి కరోనా శవాలు

Update: 2020-03-31 05:10 GMT
అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ వణికిస్తోంది. అక్కడి జనం కరోనాకు పిట్టల్లా రాలుతున్నారు. ఏడు గంటల్లో 98 మంది మరణించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ మృతదేహాలను న్యూయార్క్ ఆస్పత్రుల వెలుపల రిఫ్రిజిరేటెడ్ ట్రక్కుల్లోకి ఎక్కించిన వీడియో ఇప్పుడు అమెరికాలో ఎంతటి బీతావాహ పరిస్థితి ఉందో తేటతెల్లం చేస్తోంది.

ఫోర్ట్ గ్రీన్‌లోని బ్రూక్లిన్ హాస్పిటల్‌లో వైద్య సిబ్బంది ట్రక్కులోకి కరోనాతో చనిపోయిన మృతదేహాలను లోడ్ చేస్తున్నట్లు వీడియో చిక్కింది.  మాన్ హట్టన్ లోని ఒక నర్సు వేరే ఆసుపత్రిలో రిఫ్రిజిరేటెడ్ ట్రక్కులో మృతదేహాల ఫోటోను పంచుకుంది. దీంతో అమెరికాలో కరోనా చావులు ఎంత భయంకరంగా ఉన్నాయో.. కరోనాతో చస్తే కడసారి చూపుకు కూడా బంధువులకు నోచుకోలేని దైన్యం వెలుగుచూస్తోంది. శవాలను మూటగట్టి ట్రక్కుల్లోకి తీసుకెళ్లి బంధువులకు కూడా అప్పగించకుండా నిర్వీర్యం చేస్తున్నారు.

న్యూయార్క్ నగరంలో 36,221 మంది పాజిటివ్ పరీక్షలు నమోదయ్యాయి. ఇందులో 790 మంది మరణించారు.  న్యూయార్క్ నగరం లో మరణాల సంఖ్య 790కు చేరింది.  మొత్తం  కేసులు 36,221 కు చేరాయి. నగర మేయర్ డి బ్లాసియో ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు ఎవరైనా సరే ఇంట్లో నుంచి బయటకు వస్తే 500 డాలర్ల జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు..

ఇది అమెరికా  దేశవ్యాప్తంగా 142,000 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 2,500 మంది మరణించారు. సెప్టెంబర్ 11, 2001 దాడుల తరువాత ఇదే అతిపెద్ద మరణాలని అమెరికా అధికారులు చెబుతున్నారు. సెంట్రల్ పార్క్‌లో మరియు ప్లాజా  సెయింట్ రెగిస్ వంటి లగ్జరీ హోటళ్లను ఆస్పత్రులుగా మార్చి రోగులను క్వారంటైన్ లో ఉంచుతున్నారు.

ఇక న్యూయార్క్ నౌకాశ్రయంలో అమెరికన్ నేవీ హాస్పిటల్ షిప్ యుఎస్ఎన్ఎస్ కంఫర్ట్ లో సోమవారం 1,000 పడకలను కరోనా రోగుల కోసం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ బారిన పడి 2,00,000 లేదా అంతకంటే తక్కువ మంది మరణించే అవకాశాలు కనిపిస్తున్నాయని.. మరిన్ని  చర్యలతో మరణాలను తగ్గిస్తామని  అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు.  అధికారులు, వైద్యులను సంప్రదించిన తరువాత  ఏప్రిల్ చివరి వరకు  అమెరికా లో ఆంక్షలు కొనసాగిస్తామన్నారు. Full View
Tags:    

Similar News