భారత్ రాష్త్ర సమితి బీయారెస్ ని ఏపీలో విస్తరించేందుకు కేసీయార్ కంకణం కట్టుకున్నారు. కేసీయార్ సంకల్ప బలం ఎపుడూ గొప్పదే. ఆయన తలచుకుంటే చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తారు. అక్కడ లోపం కనిపించదు. ఆ విధంగా చూస్తే ఏపీ మీద బోలెడు ఆశలతో ఫీల్డ్ లోకి దిగుతున్న కేసీయార్ అంతు చూసేవరకూ వదలరు. మరి కేసీయార్ దూకుడు ఎవరికి ఇబ్బంది అన్నది కూడా చర్చకు వస్తోంది.
ఏపీలో చూస్తే ప్రధాన పార్టీలు అన్నీ కూడా వైసీపీతో పోరాడుతున్నాయి. ఒక విధంగా చెప్పాలీ అంటే వైసీపీ వర్సెస్ విపక్షం అన్నట్లుగా సీన్ ఉంది. ఇక కేసీయార్ ఏపీలో ఎంట్రీ ఇస్తే రాజకీయం రసకందాయంలో పడుతుంది. ఏపీలో బీయారెస్ టార్గెట్ ఆరు శాతం ఓట్లు తెచ్చుకోవడం. జాతీయ పార్టీగా ఆ మేరకు ఓట్లు కావాలి. దాని కోసం కేసీయార్ చేయాల్సిన వన్నీ చేస్తున్నారు. ఆయన ఏపీలో బలమైన కాపు సామాజికవర్గంతో పాటు ఇతర వర్గాలను రాజకీయ నేపధ్యాలను బట్టి కూడా అడ్వాంటేజ్ ని తీసుకోవాలనుకుంటున్నారు.
అయితే కేసీయార్ మీద విమర్శలు చేయడానికి ఇప్పటివరకూ ప్రధాన పక్షాలు అయితే పెద్దగా ఉత్సహం చూపించడంలేదు. కానీ రాను రానూ బీయారెస్ ఏపీలో తన ఉనికిని చాటుకుంటున్న క్రమంలో కచ్చితంగా విమర్శల జోరు పెంచే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజుకు చూస్తే బీయారెస్ వంటి పార్టీలు ఎక్కడైనా పోటీ చేయవచ్చు అని అన్ని పార్టీలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి. వెల్ కం అంటున్నాయి.
అయితే బీయారెస్ వల్ల ఎవరికి దెబ్బ పడుతుంది అన్నది చూసిన తరువాత ఆ పార్టీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూసిన తరువాతనే ప్రతిపక్షాలు పెద్ద నోరు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం జనసేన సానుభూతిపరుల నుంచి బీయారెస్ ని వైసీపీతో జతకట్టి విమర్శలు చేయడం మొదలైంది. జనసేన సానుభూతిపరుడిగా ఉన్న మాజీ మంత్రి హరిరామ జోగయ్య బీయారెస్ ని ఏపీలో పోటీ చేయించడం ద్వారా తాను లాభపడాలని మరోసారి గెలవాలని జగన్ చూస్తున్నారు అని విమర్శలు చేశారు.
ఇక ఒక టీవీ డిబేట్ లో తెలుగుదేశం నాయకుడు ఒకరు అయితే జగన్ కోసమే బీయారెస్ ఏపీలో ఎంట్రీ ఇస్తోందని చెప్పుకొచ్చారు. జగన్ సీఎం అయ్యాక కేసీయార్ తో చేసిన చెలిమిని కూడా ఆయన వల్లె వేస్తున్నారు. కేసీయార్ కోరిక మేరకే పోలవరం ఎత్తుని ఏపీ ప్రభుత్వం తగ్గించిందని, తెలంగాణకు అనుకూలంగా ఉంటోందని, అదే తెలుగుదేశం అధికారంలో ఉంటే అభివృద్ధి ఏపీలో సాగుతుందని, దాంతో కేసీయార్ ఇబ్బంది పడేవారని అంటున్నారు.
ఇది మచ్చుకు విమర్శగా తీసుకున్నా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఫ్యూచర్ లో బీయారెస్ ని వైసీపీని ఒక గాటకు కట్టి విమర్శించే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ఏపీలో చూస్తే ఒంటరి పోరుకే కేసీయార్ మొగ్గు చూపుతున్నారు అని అంటున్నారు. పైగా జనసేనకు బలంగా ఉన్న గోదావారి జిల్లాలు, టీడీపీకి పట్టున్న ఉత్తరాంధ్రా మీద బీయారెస్ ఫోకస్ పెట్టడంతఒ ఆ రెండు పార్టీలు అనుమానంగానే చూస్తున్నాయి.
ఇవన్నీ పక్కన పెడితే కేసీయార్ జగన్ మంచి మిత్రులు అన్నది గతంలో అంతా అనుకున్నారు. ఇపుడు వారి మధ్య ఎలాంటి బంధం ఉందో తెలియదు కానీ ఇప్పటికీ చంద్రబాబు కంటే జగన్ దగ్గరి వారు అన్న దానిని అంతా నమ్ముతారు. రేపటి రోజున కేసీయార్ ఏపీలో మీటింగ్స్ పెట్టి జగన్ని విమర్శించినా విపక్షాల ఓట్ల చీలికకే అది దారితీస్తుందని, అలా తన మిత్రుడి కోసమే ఇదంతా చేస్తున్నారు అని తెలుగుదేశం జనసేన కామెంట్స్ చేసే పరిస్థితి ఉంటుంది.
ఈ నేపధ్యం నుంచి చూసినపుడు మాత్రం బీయారెస్ ఏపీలో ఎంత మేరకు దూకుడు చేస్తే అంత మేరకు వైసీపీకి భారం అవుతుందా అన్నదే చర్చగా ఉంది. మరి వైసీపీ పొలిటికల్ స్టాండ్ కూడా ఈ విషయంలో చూడాల్సి ఉంది. అదే విధంగా ఏపీలో బీయారెస్ కి లభించబోయే ఆదరణను బట్టి కూడా విమర్శలు పెరిగే అవకాశాలు గట్టిగా ఉన్నాయని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.