గజ్వేల్ లో గులాబీ దళపతి కేసీఆర్ పై పోటీ చేసిన ప్రజా కూటమి అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డిపై ఓ ఆర్మీ జవాన్ చెయ్యి చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీల నాయకులపై పోలీసులు - సాయుధ బలగాలు నిరంకుశంగా ప్రవర్తించాయని చెప్పేందుకు ఇదే తార్కాణమంటూ పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో వంటేరుకు తెలుగు తెలియని ఓ జవాన్ కు మధ్య గొడవ జరగడం కనిపించింది. అక్కడే తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన ఓ ఎస్సై కూడా ఉన్నారు. ఆయన గొడవ పెద్దదవ్వకుండా వారిస్తుండటం కనిపించింది.
వంటేరు వాహనాన్ని సాయుధ జవాన్లు ఆపడంతో ఈ గొడవ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. జవాన్ తనతో దురుసుగా ప్రవర్తించడం పట్ల ఆయన ఆగ్రహోదగ్రుడయ్యారు. ఎవరి వాహనాలను ఆపుతున్నావో కూడా తెలియదా యూజ్ లెస్ ఫెలో అంటూ గద్దించారు. దీంతో తెలుగు తెలియని ఆ జవాన్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. వంటేరుపై చెయ్యేసి వెనక్కి నెట్టేశడు. వెంటనే కలుగజేసుకున్న స్థానిక ఎస్సై జవాన్ ను నిలువరించారు. అతణ్ని వెనక్కి పంపించారు. అయితే - వంటేరు మాటలు ఆపలేదు. తనను కొట్టాలంటూ జవాను ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. వెంటనే మరోసారి కలుగజేసుకున్న ఎస్సై.. జవాన్లకు తెలుగు రాదంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. వారిని తిట్టొద్దని వంటేరుకు కాస్త గట్టిగానే సూచించారు. గజ్వేల్ లో కేసీఆర్ కు వంటేరు గట్టి పోటీ ఇస్తారని.. కేసీఆర్ విజయం అంత తేలికేమీ కాదని విశ్లేషకులు అంచనా వేస్తున్న సంగతి తెలిసిందే.
Full View