అవకాశాలు అన్నిసార్లు వెతుక్కుంటూ రావు. అలా వచ్చిన వాటిని ఒడిసిపట్టటం.. దాంతో చేయాల్సిన పనుల్ని పెద్ద ఎత్తున చేస్తూ.. పట్టు పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ విషయంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి తప్పులో కాలేశారని చెప్పాలి.
అప్పుడెప్పుడో ఆమె జిమ్మిక్కులు వర్క్ వుట్ అయి.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టటం తెలిసిందే. రాష్ట్రం ఏదైనా సరే.. ఎన్నికల బరిలో నిలవటం.. ప్రభావం చూపినా.. చూపకున్నా ఎన్నికల బరిలో నిలవటం ద్వారా పలు రాస్ట్రాల్లోని ప్రజలకు బీఎస్పీ అన్నంతనే నాన్ సీరియస్ పోలిటికల్ పార్టీగా మారిందని చెప్పాలి.
తనకున్న ఇమేజ్ ను తన చేతులారా చెడగొట్టుకోవటంలో మాయావతి ముందుంటారని చెప్పాలి. ఒకప్పుడు యూపీని శాసించిన మాయావతి తాజా ఎన్నికల్లో ఆమె పార్టీకి వచ్చిన ఓట్లు.. సీట్ల సంఖ్యను చూస్తే.. యేపీలో ఆ పార్టీ పని అయిపోయిందన్న భావన కలుగక మానదు. యూపీలో తాము ప్రత్యేకమని చెప్పుకునే బీఎస్పీని ఆదరించాలని చేసే వినతిని యూపీ ప్రజలు అస్సలు పట్టించుకోలేదు.
ఇప్పటివరకు బీఎస్పీ అన్నంతనే గుర్తుకు వచ్చే ఏనుగు కాస్తా తాజా ఫలితాల్ని చూసినప్పుడు ఆ పార్టీ ఎలుకగా మారిపోయిందని చెప్పాలి. గతంలో దళితులు.. బ్రాహ్మణ ఓటుబ్యాంకుతో అధికారంలోకి వచ్చిన ఆమె ఈసారి ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయారు.
గత పార్లమెంటు ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకోవటం ఆమె పార్టీని నష్టపోయేలా చేసింది. ఆ తప్పును దిద్దుకునే క్రమంలో తాజా ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు. షాకింగ్ అంశం ఏమంటే.. ఆమె పార్టీకి అండగా నిలిచే ఓటు బ్యాంకు సైతం మాయావతి రాబట్టుకోలేకపోవటం గమనార్హం.
మరింత దారుణమైన విషయం ఏమంటే గురువారం సాయంత్రం ఐదు గంటల వేళకు ఆమె పార్టీ ఒక్క స్థానంలో మాత్రమే అధిక్యతలో ఉంది. అంతకు ముందు ఐదు స్థానాల్లో ఆమె ముందంజలో ఉన్నా.. గంటలు గడుస్తున్న కొద్దీ.. ఆమె పార్టీ అభ్యర్థులు అదే పనిగా ఓడిపోతున్న వైనం చూస్తే.. యూపీలో ఆమె పార్టీ కకావికలమైందన్న భావన కలుగక మానదు.
ఉత్తరప్రదేశ్ లోనే కాదు.. ఉత్తరాఖండ్ లోనూ బీఎస్పీ తుడిచి పెట్టుకుపోయింది. పంజాబ్ లో ఒక్క స్థానంలోనూ అధిక్యతలో లేని ఆమె పార్టీ.. ఉత్తరాఖండ్ లో మాత్రం రెండు స్థానాల్లో అధిక్యతలో ఉన్నా.. అందులో అయినా గెలుస్తారా? అన్నదిప్పుడు సందేహంగా మారింది.