కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత డిశ్చార్జ్ అయిన సుబ్బయ్య.. ఇటీవల ముగిసిన మునిసిపల్ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం తీవ్రంగా శ్రమించారు.
ఈ క్రమంలోనే మరోసారి అనారోగ్యానికి గరైనట్టు సమాచారం. దీంతో కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అక్కడ పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతిపట్ల ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాడేపల్లి నివాసం నుంచి వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 2014లో వైసీపీ ద్వారానే రాజకీయాల్లోకి ప్రవేశించిన సుబ్బయ్య.. అప్పటి నుంచీ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బద్వేలు నుంచి పోటీ చేసి విజయం సాధించారు.