నిజంగానే కొందరి జీవితాల గురించి విన్నప్పుడు అద్భుతంగానూ.. సినిమాటిక్ గానూ అనిపిస్తుంటాయి. ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. తనకేమాత్రం సంబంధం లేని రంగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించటమే కాదు.. దేశం కాని దేశంలో వారికొచ్చే క్రేజ్ గురించి విన్నప్పుడు ఆశ్చర్యమనిపించక మానదు. తాజాగా అలాంటి పేరునే సొంతం చేసుకున్నాడో యువకుడు. బుందుల్ ఖండ్ లోని ఒక కుగ్రామానికి చెందిన కుర్రాడు ఇప్పుడు చైనాలో ఆసక్తికర చర్చగా మారాడు.
ఇంతకీ అతగాడు ఎవరు? చైనాలో ఏం చేశాడు? అన్నది చూస్తే..అతగాడి పేరు సోహన్ సింగ్. బుందేల్ ఖండ్ లోని కుగ్రామమైన బర్ఖెరా అనే ఊరికి చెందిన వాడు. ఒక్కపూట తిండి తినేందుకు సైతం నోచుకోలేని నిరుపేద. అలాంటివాడు ఈ రోజు చైనాలో పాపులర్ కావటం ఆసక్తకరమైన అంశంగా చెప్పాలి.
సోహాన్ సింగ్ చదువుకునే సమయంలో అతడి టీచర్ యోగా గురించి చెప్పారు. దాని గురించి పరిచయం చేసి.. దాన్లో శిక్షణ ఇప్పించారు. యోగా.. సోహాన్ జీవితాన్ని మార్చేసింది. టీచర్ చెప్పినట్లే యోగానుక్రమం తప్పకుండా సాధన చేసేవాడు. అది కూడా.. ఉదయం చదువు.. రాత్రివేళలో ఉద్యోగం చేస్తూ..మధ్యలో యోగా ప్రాక్టీస్ చేసేవాడు. అతగాడి సాధన తర్వాతి కాలంలో అతడ్ని చైనాకు తీసుకెళ్లింది. అంతేకాదు.. అక్కడ ఉద్యోగం చేస్తూ యోగా బోధించేవాడు.
తర్వాతి రోజుల్లో సోహన్ యోగా పేరుతో ఒక ట్రైనింగ్ సెంటర్ ను ప్రారంభించాడు.అది నెమ్మదిగా పుంజుకుంది. ఈ రోజున ఆ సంస్థకు మంచి పేరు రావటమే కాదు చైనాలో పాపులర్ అయ్యింది. ఒకరోజు పూటకు తినేందుకు లేని సోహాన్.. ఈ రోజు చైనాలాంటి దేశంలో తన మార్క్ ను ప్రదర్శించటమే కాదు.. అక్కడ మంచి యోగా శిక్షకుడిగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకుంటున్నాడు. నిజంగా మనోడు గ్రేట్ కదూ!