ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి ఎదురుగా ఇంకో టాప్ బిజినెస్ మేన్ దిగారు. ముంబయిలో అంబానీ ఇల్లు ఏంటిలియా చాలా పాపులర్... కరెక్టుగా దాని ఎదురుగా ఉన్న మరో భారీ భవంతిలో రెండు ఫ్లోర్లను ముంబయికే చెందిన బిజినెస్ మేన్ దేవేన్ మెహతా రూ.125 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు.
కాగా ముఖేశ్ ఇల్లు ఉన్న ప్రాంతంలో అంతా బిజినెస్ దిగ్గజాలే ఉన్నారు. దేవేన్ మెహతా కూడా ఇప్పుడు అక్కడికే మారిపోయారు. అంబానీ ఇంటి ఎదురుగా ఉండే 40 అంతస్థుల లోధా అల్తామౌంట్ భవనంలోని 85000 చదరపు అడుగులు విస్తీర్ణం ఉన్న రెండు ఫోర్లను మెహతా కొనుగోలు చేశారు. మెహతా స్మార్ట్ కార్డ్ ఐటీ సొల్యూషన్స్ లిమిటెడ్ అధినేత.
ఈ లోధా భవనంలో అంతా పేరుమోసిన వ్యాపారవేత్తలే ఉంటున్నారు. అందుకే దాన్ని బిలియనీర్స్ అవెన్యూ అని కూడా అంటారు. కుమార మంగళం బిర్లా, అంబుజా సంస్థ అధినేత నరోత్తమ్ షేక్సేరియా, డీ-మార్ట్ గ్రూప్ అధినేత రాధాకృష్ణ దమారియా వంటివారంతా అక్కడే నివసిస్తున్నారు. జిందాల్ డ్రగ్స్ కు చెందిన శ్రీకృష్ణ, అజయ్ జిందాల్ ల నివాసం కూడా అందులోనే. ఇలా.... ముంబయిలోని టాప్ మోస్ట్ బిజినెస్ మేన్లంతా అంబానీ ఇంటెదురుగానే ఉన్నారు.