లోకేశ్ పాలిటిక్స్‌కు ప‌నికి రాడంతే!

Update: 2018-04-13 09:10 GMT
టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - ఏపీ కేబినెట్ లో యువ మంత్రిగానే కాకుండా పార్టీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు పుత్ర‌ర‌త్నంగా నారా లోకేశ్ కు ఇప్పుడు ఎక్క‌డ లేని ప్రాధాన్యం వ‌చ్చేసింద‌నే చెప్పాలి. తెలుగు నేల ఉమ్మ‌డిగా ఉన్న స‌మ‌యంలో అంత‌గా రాజ‌కీయాల వైపు దృష్టి సారించ‌ని లోకేశ్... తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోవ‌డానికి కాస్తంత ముందుగా రంగంలోకి దిగేశార‌ని చెప్పాలి. తొలుత పార్టీలో ప్రాథ‌మిక స‌భ్య‌త్వంతోనే ఎంట్రీ ఇచ్చిన లోకేశ్... పార్టీ కార్య‌క‌ర్త‌ల సంక్షేమ నిధి వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షించారు.  ఆ త‌ర్వాత గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో రంగంలోకి దిగేందుకు జ‌డిసిపోయిన చిన‌బాబు... త‌న తండ్రి నియోజ‌క‌వ‌ర్గం కుప్పంతో పాటు ప‌లు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ అభ్య‌ర్థుల గెలుపున‌కు కృషి చేసిన‌ట్లుగా క‌ల‌రింగ్ ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా *న‌మ్మ‌క ద్రోహం చేసిన ఒకే ఒక్క పార్టీ టీడీపీ* అంటూ మాట తూలిన లోకేశ్... ఒక్క‌సారిగా జ‌నం దృష్టిని ఆకర్షించారు. సొంత పార్టీనే ఇంత‌గా దునుమాడిన లోకేశ్... నిజంగానే రాజ‌కీయ నేతేనా? అన్న అనుమానాలు కూడా కలిగాయ‌నే చెప్పాలి. ఈ విష‌యంపై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌ర‌గ‌గా... పార్టీని లోకేశ్ దునుమాడ‌లేద‌ని, ఏదో అలా మాట తూలాడ‌ని చివ‌ర‌కు ఓ అంచ‌నాకు వ‌చ్చేసిన తెలుగు త‌మ్ముళ్లు ఎలాగోలా స‌ర్దేసుకున్నారు. ఆ త‌ర్వాత పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం, ఆ త‌ర్వాత దొడ్డిదారిన చ‌ట్ట‌స‌భ‌ల్లోకి ఎంట్రీ ఇవ్వ‌డం, ఆ వెంట‌నే తండ్రి కేబినెట్ లో కీల‌క శాఖ‌ల మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. అంతా బాగానే ఉన్నా... అతి స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే లోకేశ్ కు అంద‌లం ద‌క్కినా....అందుకు త‌గ్గ‌ట్టుగా త‌న‌ను తాను తీర్చిదిద్దుకోవ‌డంలో మాత్రం లోకేశ్ స‌క్సెస్ కాలేక‌పోతున్నార‌నే చెప్పాలి.

మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత జ‌యంతిని వ‌ర్ధంతిని చేసిన ఘ‌న‌త లోకేశ్ కే ద‌క్కింది. ఇక మొన్న‌టికి మొన్న రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన స‌మ‌యంలో న‌రేంద్ర మోదీ ప్ర‌ధాన మంత్రిగా ఉన్నార‌ని చెప్పడం కూడా లోకేశ్ కు మాత్ర‌మే చెల్లింద‌ని చెప్పాలి. ఈ క్ర‌మంలో ఈ మొత్తం ఎపిసోడ్‌ ను మ‌రోమారు జనానికి గుర్తు చేసిన ఒక‌ప్ప‌టి టీడీపీ నేత‌, మాజీ మంత్రి, ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ నేత‌గా ఉన్న సి.రామ‌చంద్ర‌య్య... టీడీపీ నేత‌లంతా త‌మ యుఎవ కిశోరంగా భావిస్తున్న లోకేశ్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు లోకేశ్ రాజ‌కీయాల‌కు ప‌నికి రాడ‌ని రామ‌చంద్ర‌య్య తేల్చి పారేశారు. ఒక‌టి, అరా అయితే ఏదోలే అనుకోవ‌చ్చు... రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ప‌దేళ్ల‌వుతున్నా త‌న‌ను తాను తీర్చిదిద్దుకోవ‌డం రాని నేత రాజ‌కీయాల్లో ఎలా రాణిస్తాడ‌ని కూడా సీఆర్ త‌న వాద‌న  స‌రైన‌దేన‌న్న కోణంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Tags:    

Similar News