యువ సమాజం. ఉత్తమ భవిష్యత్తు. అవినీతి రహిత సమాజం. నోరు తెరిస్తే పవన్ వల్లించే వేదాలివి. కానీ... పవన్ కళ్యాణ్ చేగువేరా పుస్తకాలు జనాలకు చూపించడం తప్ప అందులో కంటెంట్‌ను తలకు ఎక్కించుకోలేదన్న కొత్త అనుమానాలు ప్రజలు, ప్రముఖులు వ్యక్తంచేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఈరోజు సుజనా చౌదరి పై చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక నేరాల కేసు మోపబడింది. సామాన్యులు రూపాయి రూపాయి దాచుకుని బ్యాంకులను కాపాడుతుంటే వాటి వద్ద పోగుబడిన వేల కోట్ల డబ్బును కొందరు కారొరేట్ ముసుగులు వేసుకున్న వారు వాటిని లూటీ చేస్తున్నారు. సుజనా చౌదరి కూడా ఆ జాబితాలో ఉన్నారని ఈడీ దాడులతో బట్టబయలైంది. వేల కోట్ల రుణాలు తీసుకుని బ్యాంకులను ముంచారంటూ ఆయనపై కేసులు నమోదు చేశారు. ఇది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యింది. దీనిపై స్వతహాగా సీఏ అయిన సీనియర్ రాజకీయ నేత సి.రామచంద్రయ్య స్పందిస్తూ ... అమాయక ప్రజలు దాచుకున్న డబ్బును చంద్రబాబు అండ్ కో దోచుకుని రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించారని తెలిపారు. ఉగ్రవాదుల కన్న చంద్రబాబు అండ్ కో ప్రమాదకరమైన వ్యక్తులని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
దీనిపై పవన్ కళ్యాణ్ అసలు స్పందించకపోవడం చూస్తుంటే కొత్త అనుమానాలు కలుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించడం కొసమెరుపు. ఒకవైపు నా వద్ద డబ్బు అసలు లేదంటూనే పవన్ కళ్యాణ్ భారీ కార్యక్రమాలు చేస్తుండటం, సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి వారిపై ఇంత భారీ కేసులు నమోదవుతున్నపుడు అసలు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. పవన్ కల్యాణ్ ఎవరి కనుసన్నల్లో అయినా పనిచేస్తున్నారా అని అనుమానం కలుగుతోందన్నారాయన.
నిజమే... వైసీపీ నేతలు రాఫెల్ పై స్పందించినపుడు కూడా పవన్ స్పందించలేదు. తాజాగా ఇంత పెద్ద కేసులోనూ స్పందించలేదంటే... రామచంద్రయ్య అన్నదాని గురించి ఆలోచించాల్సి వస్తోంది.