తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు - ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరుపై ఒకనాటి ఆయన సహచరుడు - మాజీ ఎంపీ సి.రామచంద్రయ్య ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు - రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఒకింత గ్యాప్ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రి ఘటన దురదృష్టకమని - ఈ పరిణామతో రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా లేదా అనే సందేహం వస్తోందన్నారు. పోలీసులు,. పార్లమెంట్ సభ్యుడి మధ్య జరిగిన సంఘటన అవాంఛనీయమని ఈ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు.
బాబ్లీ ప్రాజెక్ట్ ద్గగర చేసిన ఆందోళనకు సంబంధించి ధర్మాబాద్ న్యాయస్థానం జారీచేసిన సమన్ల విషయంలో కోర్టుకు హాజరు కాకుండా కేంద్రప్రభుత్వాన్ని - ప్రధానమంత్రి నరేంద్రమోడీని దుమ్మెత్తిపోయటం అత్యంత హేయం, దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని చంద్రబాబు తీరును ఆయన తప్పుపట్టారు. చట్టానికి ఎవరు అతీతులు కారనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని సీ రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. వ్యవస్థను నిర్వీర్యం చేయడం - తన మంత్రులతో అనవసరమైన వ్యాఖ్యానాలు చేయడం చట్టాన్ని రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడంతో సమానం అనే విషయం ముఖ్యమంత్రి తెలుసుకోవాలని రామచంద్రయ్య ఎద్దేవా చేశారు. చంద్రబాబు నేల విడిచి సాము చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయ అవినీతి మరియు ప్రతి ఒక్క శాఖ నిర్వీర్యం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విజయం సాధించినట్లు కనబడుతోందని రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. అంచనాలు మించి ఖర్చు చేయడం ద్వారా - రాష్ట్రంలో విపరీతమైన ఖర్చు ఆర్థికభారం చంద్రబాబునాయుడు నిర్లక్ష్యం కారణంగా జరుగుతున్నాయని మండిపడ్డారు.
ఆర్థికశాఖపై పర్యవేక్షణ కరువైందని, కుటుంబరావు లాంటి వ్యక్తులు జవాబు చెప్పించడం ఎంతవరకు సబబని రామచంద్రయ్య ప్రశ్నించారు. ఆర్థికశాఖ మంత్రికి వెసులుబాటు లేదా అని ప్రశ్నించారు. ఆబ్కారీ శాఖపై పట్టుకోల్పోయారని, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడం ఆర్ధికంగా రాష్ట్రాన్ని తిరోగమనం దిశగా నడిపిస్తున్నారని మండిపడ్డారు. కాబినెట్ నిర్ణయాలకు అతీతంగా చంద్రబాబునాయుడు స్వీయ నిర్ణయంతో వందల సంఖ్యలో ప్రభుత్వ జీఓలు వెలువడుతున్నాయని విమర్శించారు. ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన ప్రభుత్వం ఒక ప్రైవేట్ వ్యవస్థలా మార్చేశారని దుయ్యబట్టారు. ``చంద్రబాబునాయుడుగారు మీకన్నా తెలివికలిగిన వాళ్ళు మీ కాబినెట్ మంత్రులుగా ఉన్నారు. వారి సహకారాన్ని తీసుకొని నిర్ణయాలు తీసుకోండి. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఒంటెద్దు నిర్ణయాలు సరియైనవి కావు`` అని హెచ్చరించారు. రాజధాని నిర్మాణంలో ఒక రూపాయి కూడా అప్పుతీసుకోకుండా నిర్మిస్తానన్నారని రామచంద్రయ్య గుర్తు చేశారు. ``39 వేలకోట్లు ఖర్చు పెట్టి విచ్చలవిడి అవినీతికి పాల్పడ్డారు. నూతన ఒరవడితో కూడిన అవినీతికి చంద్రబాబు బ్రాండ్‌గా నిలిచారు. అమరావతి ప్రజల రాజధాని కాదు. చంద్రబాబు ముఖ్యులు మరియు కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే రాజధాని. ఈ ప్రయత్నంలో చంద్రబాబు సఫలీకృతులయారు`` అని ఆరోపించారు.