ఆ సీనియ‌ర్‌ తో బాబుకు త‌ల‌నొప్పులే

Update: 2018-11-23 07:47 GMT
రాజ‌కీయంగా బ‌ద్ద‌ శ‌త్రువు అయిన టీడీపీతో కాంగ్రెస్ పార్టీ క‌ల‌వ‌డం - ఇందులో కాంగ్రెస్ సీనియ‌ర్లకు మాట‌మాత్రం అయినా స‌మాచారం లేక‌పోవ‌డాన్ని జీర్ణించుకోలేక‌పోతూ ప‌లువురు సీనియ‌ర్లు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌ బై చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఇలా కాంగ్రెస్‌ ను వీడిన  మాజీ మంత్రి సి రామచంద్రయ్య వైసీపీలో చేరారు. కాగా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఆయనకు కీల‌క‌ బాధ్యతలు అప్పగించారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా - అధికార ప్రతినిధిగా రామ‌చంద్ర‌య్య‌ నియమితులయ్యారు.

 సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో కాంగ్రెస్ పార్టీ నామ‌మాత్ర‌పు స్థాయికి చేరిపోయిన‌ప్ప‌టికీ ఆ పార్టీ త‌ర‌ఫున గ‌ళం వినిపించే నేత‌ల్లో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత - మాజీ ఎంపీ సీ రామచంద్రయ్య ఒక‌రు. ఏపీ సీఎం చంద్ర‌బాబును నిశితంగా విమ‌ర్శించ‌డంలో ఆయ‌న దిట్ట‌. పోలవరం - పట్టిసీమ - ఇసుక - మట్టి - విద్యుత్‌ - మద్యం - ఎర్రచందనం ఇలా పలు అంశాల్లో అనేక విధాలుగా స్వయంగా చంద్రబాబు - లోకేష్‌ అవినీతికి పాల్పడ్డారని ఆయన అనేక సంద‌ర్భాల్లో ఆరోపించారు. అవినీతి గురించి - దాడుల గురించి చంద్ర‌బాబు స్పందిస్తున్న తీరు చిత్రంగా ఉంద‌ని సి.రామచంద్రయ్య ప్రశ్నించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు అవినీతిని ప్రశ్నించడం - సోదాలు చేయడం తప్పుకాదని...అయినా తప్పుచేయకుంటే దర్యాప్తు చేస్తే భయమెందుకని ఈ అవినీతికి సంబంధించి చంద్రబాబు - లోకేష్‌ లను విచారించాలని రామచంద్రయ్య డిమాండ్ చేశారు. తప్పుచేయనప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు - లోకేష్ విచారణ ఎదుర్కొని తీరాలని...భయమెందుకని అన్నారు. ``చంద్ర‌బాబు గారూ...ఓటుకు నోటు కేసులో వాయిస్‌ మీది కాదా - ప్రధాన సూత్రదారి మీరు కాదా?`` అని చంద్రబాబును రామచంద్రయ్య నిలదీశారు. ఇలా అంశాల వారీగా స్పందించే సీనియ‌ర్‌ కు కీల‌క ప‌ద‌వి ద‌క్కిన నేప‌థ్యంలో..రాబోయే కాలంలో బాబుకు విమ‌ర్శ‌ల జోరు పెర‌గ‌డం ఖాయ‌మ‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.

ఇలా ముఖ్య‌నేత‌గా ఉన్న సి.రామ‌చంద్ర‌య్య అనంత‌రం వైసీపీలో చేరారు. సీనియ‌ర్ల‌కు గుర్తింపు నివ్వ‌డంలో భాగంగా వైసీపీ ఆయ‌న‌కు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా - అధికార ప్రతినిధిగా అవ‌కాశం క‌ల్పించింది. కాగా, వైఎస్సార్‌ జిల్లా రాజంపేట నియోజకవర్గానికి చెందిన రామచంద్రయ్య 1981లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రిగా ప్రజలకు సేవలందించారు.
Tags:    

Similar News