కేసీఆర్ కు సీ ఓట‌ర్ స‌ర్వే షాక్!

Update: 2018-10-05 11:18 GMT
తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో అక్క‌డి రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. మ‌రోసారి అధికారం త‌న‌దేన‌న్న కాన్ఫిడెన్స్ తో ఆప‌ద్ధ‌ర్మ సీఎం కేసీఆర్ ప్ర‌చారం చేస్తున్నారు. 2019 ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ 100 స్థానాలు కైవ‌సం చేసుకుంటుంద‌ని కేసీఆర్ కాన్ఫిడెంట్ గా చెప్పిన సంగ‌తి తెలిసిందే. తాజాగా, ఆ సంఖ్య‌ను గులాబీ ద‌ళాధిప‌తి...110కు పెంచారు. ఇక‌, మిత్ర‌ప‌క్షం మ‌జ్లిస్ తో క‌లుపుకొని మొత్తం 117 స్థానాల్లో విజ‌య‌భేరి మోగిస్తామ‌ని కేసీఆర్ ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తున్నారు. కేసీఆర్ కాన్ఫిడెన్స్ లెవ‌ల్స్ చూసి టీఆర్ ఎస్ నేత‌లు కూడా విస్తుపోతున్న‌ నేప‌థ్యంలోనే తాజాగా కేసీఆర్ కు ఓ జాతీయ స్థాయి స‌ర్వే షాకిచ్చింది. తెలంగాణ‌లో ఇప్ప‌టికిప్పుడు లోక్ స‌భ ఎన్నిక‌లు జ‌రిగితే టీఆర్ ఎస్ కేవ‌లం 9 సీట్ల‌తోనే స‌రిపెట్టుకోవాల్సి వ‌స్తుంద‌ని ఆ స‌ర్వే వెల్ల‌డించింది.

లోక్ స‌భ ఎన్నిక‌ల గెలుపోట‌ముల పై సీ ఓట‌ర్ స‌ర్వే నిర్వ‌హించింది. ఆ స‌ర్వేలో కేసీఆర్ కు షాకిచ్చే రిపోర్టులు వ‌చ్చాయట‌. ప్ర‌స్తుతం ఉన్న‌ప‌ళంగా లోక్ స‌భ ఎన్నిక‌లు జ‌రిగితే టీఆర్ ఎస్ 9 ఎంపీ స్థానాల‌కు ప‌రిమితం కావాల‌ట‌. కాంగ్రెస్ కు 6 ఎంపీ స్థానాలు - మ‌జ్లిస్ కు ఒక ఎంపీ స్థానం - బీజేపీకి ఎంపీ స్థానం ద‌క్క‌నున్నాయ‌ట‌. టీడీపీ-కాంగ్రెస్ ల పొత్తు వ‌ల్ల కాంగ్రెస్ కు 6 సీట్లు వ‌స్తాయ‌ట‌. 2014తో పోలిస్తే ఈ సారి మ‌జ్లిస్ కు 22 శాతం ఓట్లు అధికంగా వ‌స్తాయ‌ట‌. ఏది ఏమైనా...ఈ సారి ఎన్నికల్లో తమ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంద‌ని విప‌రీత‌మైన కాన్ఫిడెంట్ తో ఉన్న కేసీఆర్ కు తాజా స‌ర్వే షాకిచ్చంద‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌రి, అసెంబ్లీ ఎన్నిక‌ల విష‌యంలో కూడా కేసీఆర్ అంచ‌నా  స‌రైన‌దో కాదో తెలియాలంటే మ‌రి కొంత కాలం వేచి చూడ‌క త‌ప్ప‌దు. ఏది ఏమైనా...ప్రస్తుతం సీ ఓట‌ర్ స‌ర్వే...తెలంగాణ‌లో హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News