సోషల్ మీడియాలో వైరల్ కావటమో లేదంటే.. ఇదే మంచి మార్గం అనుకుంటున్నారో కానీ తెలంగాణలో కొత్త ట్రెండ్ మొదలైంది. తమ పిల్లలు స్కూల్ కు వెళ్లనని మారం చేస్తే.. మరో ఆలోచన లేకుండా డయల్ 100కు ఫోన్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న డయల్ 100కు ఫోన్ చేసిన ఓ తల్లి.. సారూ.. అర్జెంట్ గా ఇటు రావాలంటే.. ఏం ఘోరం జరిగిందో అంటూ ఉరుకులు పరుగులు తీసుకుంటూ ఆమె చెప్పిన అడ్రస్ కు వచ్చారు.
ఏంది తల్లి.. సమస్య అంటే.. మా పిల్లాడు స్కూల్ కు వెళ్లమంటే వెళ్లనంటున్నాడు.. మీరే చూడాలి ఆడి సంగతన్న మాటతో కంగుతిన్నారు పోలీసులు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయ్యిందో తెలిసిందే. తాజాగా.. అలాంటి ఉదంతమే మరొకటి చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరికి చెందిన పార్వతమ్మ తమ పిల్లాడు స్కూల్ కు వెళ్లనని మారం చేయటంతో పోలీసులకు ఫిర్యాదు చేయటం సంచలనంగా మారింది.
తన భర్త ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడని.. అప్పటి నుంచి తన కొడుకు లోకేశ్ ను ఎలాగైనా ప్రయోజకుడ్ని చేయాలని కష్టపడి చదివిస్తున్నట్లు ఆమె చెప్పారు. గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న లోకేశ్ వారం క్రితం హాస్టల్ నుంచి వచ్చాడని.. తిరిగి స్కూల్ కు వెళ్లనని చెబుతున్నాడని ఆమె చెప్పారు.
తానెంత బతిమిలాడినా వినటం లేదని.. మరో మార్గం లేకపోవటంతో తాను డయల్ 100కు ఫోన్ చేసినట్లు పార్వతమ్మ వెల్లడించింది. దీంతో.. పోలీసులు ఆ కుర్రాడికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. చదువు విలువ.. బడికి వెళ్లాల్సిన అవసరాన్ని చెబుతున్నారు. పిల్లల్ని బడికి పంపేందుకు డయల్ 100 వాడేస్తున్న వైనం ఇటీవల కాలంలో తెలంగాణలో అంతకంతకూ ఎక్కువ అవుతోంది.