ఏపీలో మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందా. జరిగితే ఎపుడు, అసలు పూర్తి స్థాయిలో మంత్రి వర్గాన్ని తొలగిస్తారా లేక చిన్నపాటి మార్పు చేర్పులతో సరిపెడతారా. ఇవన్నీ డౌట్లే. జవాబునకు దొరకని ప్రశ్నలే. వీటికి కరెక్ట్ సమాధానం చేప్పేవారు వైసీపీలో ఎవరూ లేరు. ఒక్క జగన్ కి తప్ప ఎవరికీ కూడా దీని మీద తెలిసేది కూడా లేదు. ఆయన అయితే ఫుల్ సైలెంట్ గా ఉంటారు, వీటి మీద అసలు నోరు మెదపరు. మరి ప్రస్తుత్రం మంత్రి పదవుల విషయంలో జరిగే చర్చంతా ఏంటి, ఎందుకు అంటే అదంతా రచ్చ, రాద్ధాంతమే అనుకోవాలా. సరే అలా అనుకున్న వారు ఒక వైపు ఉంటే కాబోయే మంత్రిని తానే అంటూ కొందరు అపుడే హడావుడి చేయడమే అసలైన విడ్డూరం.
విశాఖ జిల్లా నుంచి చూస్తే ఆశావహులు చాలా మందే ఉన్నారు. పాతిక వేల మెజారిటీతో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి మీద గెలిచిన నర్శీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ నుంచి మొదలుపెడితే చిట్ట చివరి నియోజకవర్గంగా ఉన్న పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు దాకా అందరూ రేసులో ఉన్నట్లే. చిత్రమేంటంటే రాజుల కోటాలో తనకూ మంత్రి కావాలని ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు గట్టిగా కోరుకుంటున్నారు. ఇక కాపుల కోటా చూపించి అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరానాధ్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ జోరు చేస్తూంటే పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ ని ఓడించిన తనకూ చాన్స్ ఉండదా అంటున్నారు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి.
ఏజెన్సీలో దూకుడు చేస్తున్న పాడేరు ఎమెంల్యే కె భాగ్యలక్ష్మితో పాటు బుద్ధిగా పనిచేసుకునే అరకు ఎమ్మెల్యే శెట్టి ఫల్గుణ సైతం లిస్ట్ లో ఉన్నారు. మరి ఇంత మంది ఇన్ని విధాలుగా ఆశపడుతూంటే మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు మరో అడుగు ముందుకేశారు. ఆయన అన్ని లెక్కలు కట్టేసుకుని తానే కాబోయే మంత్రిని అంటున్నారు. అంతే కాదు స్పీడ్ బాగా పెంచేసి అపుడే విశాఖ క్యాంప్ ఆఫీస్ ని కూడా రెడీ చేసేశారు అని టాక్ నడుస్తోంది.
ఇంతకీ బూడి ముత్యాలనాయుడు ధీమా ఏంటి అంటే ఆయన జగన్ కే కాదు, వైఎస్సార్ తో సైతం సన్నిహితంగా ఉంటూ టోటల్ ఫ్యామిలీకే వీర విధేయుడు అయిన నాయకుడు. 2014లో ఆయా తొలిసారి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పట్లో 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీ వైసీపీ నుంచి లాగేసింది. ఆ టైమ్ లో బూడి ముత్యాలనాయుడిని కూడా గట్టిగానే టార్గెట్ చేశారు. అయితే ఆయన జగన్ పక్షం నుంచి తాను బయటకు వచ్చేది లేదని చెప్పేసి పార్టీకి కట్టుబడిన నేతగా జగన్ దృష్టిలో ముద్ర పడ్డారు. అందుకే జగన్ ఆయన అంటే ప్రత్యేకమైన అభిమానం చూపిస్తారు అంటారు.
విశాఖ రూరల్ జిల్లాలో బలమైన సామాజికవర్గంగా వెలమలు ఉన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నపుడల్లా ఆ సామాజికవర్గానికి మంత్రి పదవులు ఇస్తూ వచ్చింది. అలాగే చింతకాయల అయ్యన్నపాత్రుడు అనేక సార్లు మంత్రి కాగలిగారు. వైసీపీ వచ్చాక మొత్తం జిల్లాలో ఒకే ఒక మంత్రి పదవి ఇచ్చారు. అది కూడా కాపులకే దక్కింది. అయితే ఎన్నికల మంత్రివర్గంగా జగన్ ఈసారి అనేక కీలకమైన మార్పులు చేస్తారని అంటున్నారు. దాంతో వెలమ సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇస్తారని, అది కూడా బూడి ముత్యాలనాయుడు లాంటి సీనియర్ కే పదవి అంటున్నారు. ఈ మేరకు బూడికి సంకేతాలు రావడంతోనే ఆయన విశాఖలో హార్ట్ ఆఫ్ ది సిటీలో బ్రహ్మాండమైన ప్లేస్ లో క్యాంప్ ఆఫీస్ ని కూడా రెడీ చేసి పెట్టుకున్నారని అంటున్నారు. మొత్తానికి జగన్ ఎపుడు మంత్రి వర్గ విస్తరణ చేపడతారో తెలియదు కానీ బూడి మాత్రం తానే కాబోయే మంత్రి అంటున్నారు.