ఎయిర్ టీమర్ కరోనా వైరస్ ను అడ్డుకుంటుందా?

Update: 2020-03-24 08:50 GMT
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ ...ప్రస్తుతం సోషల్ మీడియా లో స్టార్ గా మారిపోయారు. దానికి కారణం అయన గత కొన్ని రోజులుగా ఉపయోగిస్తున్న గాడ్జెట్. అయన ఈ మధ్య కాలంలో ఆ గాడ్జెట్ లేకుండా బయటకి రావడంలేదు. అయన తాజాగా జరిగిన పార్లమెంట్ సమావేశాలకి కూడా ఈ ఎయిర్ టీమర్ తోనే హాజరైయ్యారు.  అయితే , ప్రస్తుతం కరోనా ప్రపంచాన్ని కుదిపేస్తున్న సమయంలో అయన మరోసారి సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నారు.

ఎంపీ  ఉపయోగించే ఆ గాడ్జెట్ ..చూడటానికి సెల్‌ ఫోన్‌ లా కనిపిస్తున్నప్పటికీ - అసలు అ  గాడ్జెట్‌ ని ఎందకు ఉపయోగిస్తారో అందరికి తెలిసి ఉండకపోవచ్చు. దాని ఉపయోగం తెలిసినవారు సైలెంట్ గా ఉన్నప్పటికీ ..మరికొందరు మాత్రం ఆయన్నేఅడగ్గా ..దానికి అయన ఆ గాడ్జెట్ యొక్క ఉపయోగం ఏమిటో కూడా తెలిపారు.  అసలు ఎంపీ మెడలో ఉన్న ఆ గాడ్జెట్  ఎయిర్ ప్యూరిఫయర్. దీన్నే నెగటివ్ అయోనైజర్ అని  కూడా కొంతమంది పిలుస్తారు. అలాగే , ఎయిర్ టేమర్ అని కూడా అంటున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పర్సనల్ ఎయిర్‌ ప్యూరిఫయర్.  అయితే, ప్రస్తుతం మనదేశంలో ఉన్న వాయుకాలుష్యం వల్ల ఈ ఎయిర్‌ ప్యూరిఫయర్ల వాడకం పెరిగింది.

అయితే , ఈ ఎయిర్ టీమర్ మన చుట్టూ ఉన్న దుమ్ము - ధూళి - బ్యాక్టీరియా - వైరస్ లను పసిగట్టి చంపేస్తుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం పెరిగిపోతున్న నేపథ్యంలో ..ఈ గాడ్జెట్ ల పై అందరి చూపు పడుతుంది. అయితే, ఈ గాడ్జెట్ కరోనా వైరస్ ను చంపేస్తుందా అంటే దాన్ని తయారుచేసిన సంస్థ కూడా చంపేస్తుంది అని కచ్చితంగా చెప్పలేకపోతుంది. వైరస్ - బ్యాక్టీరియాలను దరిచేరనివ్వదని విక్రయ సంస్థ ఎయిర్‌ టేమర్ చెబుతున్నప్పటికీ ఎలాంటి వైరస్‌లను అడ్డుకోగలదు.. ఏ స్థాయి వరకు అడ్డుకోగలదన్న విషయంలో మాత్రం స్పష్టతలేదు.
Tags:    

Similar News