ధ‌ర్మ సందేహంః వ్యాక్సిన్ తీసుకున్నాక‌ మందు వేయొచ్చా?

Update: 2021-04-11 23:30 GMT
మందు గ్లాసు అకేష‌న్ గా ప‌ట్టుకునేవారు ఉంటారు.. గ్లాసు ప‌ట్టుకునేందుకే అకేష‌న్స్ క్రియేట్ చేసుకునే వారూ ఉంటారు. నిత్య క‌ల్యాణం టైపులో రోజూ పెగ్గేసే వారు కూడా ఉంటారు. ఇలాంటి వారు క‌రోనా టీకా తీసుకుంటే ప‌రిస్థితి ఏంటీ? వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత మందు తాగొచ్చా లేదా? తాగితే ఏమవుతుంది? తాగితే ఎంత తాగాలి? ఇదీ.. వారి ధ‌ర్మ సందేహం.

నిజానికి కరోనా టీకా తీసుకుంటే దాని పెర్ఫార్మెన్స్ ఎంత అన్న‌ది తెలియ‌నే లేదు. ఇత‌ర అవ‌య‌వాల‌పై దుష్ప్ర‌భావం చూపుతుందా? చూపితే ఎంత అనేది కూడా వందశాతం ఖచ్చితంగా తెలియదు. ఇలాంటి సమయంలో మందు తాగితే ఏమైనా ఇబ్బంది అవుద్దా అని చాలా మంది భ‌య‌ప‌డుతున్నారు. స‌మాధానం తెలియ‌క బాధ‌ప‌డుతున్నారు.

అయితే.. టీకా త‌యారు చేసిన కంపెనీలేవీ మ‌ద్యం విష‌యంలో స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. అంటే.. తాగాలా వ‌ద్దా? అనేది చెప్ప‌లేదు. మ‌రి, ఇప్పుడు ఏం చేయాలి అన్న‌ది మందుబాబుల ఆవేద‌న‌. టీకా తీసుకున్న త‌ర్వాత తాగ‌కుండా ఉంటాం.. కానీ, ఎన్ని రోజులు? అన్న‌ది వారి న్యాయ‌మైన డౌట్. ఎన్నాళ్లో తెలియ‌కుండా ఎలా ఉండేదీ అని దిగులు ప‌డుతున్నారు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో మందుబాబులు చేయాల్సిన ప‌ని ఒక్క‌టే ఉంది. వైద్యులు మ‌ధ్యే మార్గంగా చేసే సూచ‌న‌ల‌ను పాటించ‌డం. అదేమంటే.. వ్యాక్సిన్ తీసుకోవ‌డం ద్వారా శ‌రీరంలో యాంటీ బాడీలు ఉత్ప‌త్తి అవ్వ‌డం మొద‌లవుతుంది. అవి పూర్తిస్థాయిలో ఉత్ప‌త్తి అయ్యే నా‌టికి క‌నీసం నాలుగు వారాల స‌మ‌యం ప‌డుతుంది. అంటే.. ఒక నెల రోజులు అన్న‌మాట‌.

వ్యాక్సిన్ త‌యారు చేసినోళ్లు చెప్ప‌లేదు.. వైద్యులకు తెలిసింది చెప్తున్నారు.. కాబ‌ట్టి..మందుబాబులు విన్న‌ది అర్థం చేసుకొని నాలుగు వారాలు గ్లాసుకు దూరంగా ఉంటే బెట‌ర్. అబ్బో... అంత గ్యాపా..? అంటే వెళ్లి మీ డాక్ట‌ర్ ను క‌ల‌వాల్సిందే. ఆయ‌న చెప్పిన‌ట్టు చేయాల్సిందే.
Tags:    

Similar News