ఈటలను టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయొచ్చు కదా?

Update: 2021-05-27 09:30 GMT
టీఆర్ఎస్ రాజకీయంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదేం రాజకీయం అని నిలదీస్తున్నాయి. కరోనా కల్లోలం వేళ ఆ రక్షణ చర్యలు చేపట్టకుండా పార్టీలోంచి తొలగించి రాజకీయాలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి.

తెలంగాణ కేబినెట్ నుంచి ఈటల రాజేందర్ ను తొలగించడంపై రాష్ట్ర రాజకీయాల్లో ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది. ఈటల తొలగించబడ్డాక వరుసగా తెలంగాణలోని కేసీఆర్ వ్యతిరేకులతో సమావేశం అవుతున్నారు.

తాజాగా ఈటల రాజేందర్ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో గురువారం భేటి అయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు సరికాదని కోదండరాం అన్నారు. రాజకీయ విభేదాలు ఉంటే చర్చించుకోవాలని హితవు పలికారు. ప్రజాస్వామ్య పద్ధతులను కేసీఆర్ పాటించడం లేదని మండిపడ్డారు.

ఇక కొండా విశ్వేశ్వరరెడ్డి సైతం ఈటల తో భేటి తర్వాత మాట్లాడారు. ఈటలను ఇంకా ఎందుకు పార్టీలో ఉంచుకున్నారని ప్రశ్నించారు. ఆరోపణలు వచ్చినప్పుడు సస్పెండ్ చేయవచ్చు? కదా అని నిలదీశారు. టీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.
Tags:    

Similar News