పవన్ కల్యాణ్ చేపట్టిన రెండు కిలోమీటర్ల లాంగ్ మార్చ్ కు తెలుగుదేశం పార్టీ బాహాటంగా, అంతర్గతంగా మద్దతును ఇచ్చింది. ఐదు నెలల కిందటే ఎన్నికలు పూర్తి అయిన నేపథ్యంలో ఇప్పుడు జనసేనకు ఒక ధర్నాను నిర్వహించే శక్తి ఉందని ఎవరూ అనుకోరు. ఎందుకంటే ఆ పార్టీ అధినేతే ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయారు. అలాంటి పార్టీకి ఆధ్వర్యంలో ధర్నా అంటే..జన సమీకరణ కూడా అంత తేలిక కాదు.
అయితే పవన్ కు అడుగడుగునా తెలుగుదేశం పార్టీ సాయపడిందని ప్రచారం జరుగుతూ ఉంది. ఆఖరికి భోజన ఏర్పాట్లు, ఆర్థిక వనరులు.. వచ్చిన వారికి రెండు వందల యాభై రూపాయలు..వంటివన్నీ టీడీపీనే సమకూర్చిందని ప్రచారం సాగుతూ ఉంది. జనసమీకరణ విషయంలో ముందే అనుమానాలతో..మార్చ్ ను రెండు కిలోమీటర్ల పరిధికే పరిమితం చేశారని కూడా విశ్లేషకులు అంటున్నారు.
ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ధర్నాకు రెడీ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు నిరాహార దీక్ష చేస్తారట. అయితే అది పొద్దున్నుంచి సాయంత్రం వరకే కావొచ్చు.
ఇసుక విషయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరుకు, ఇప్పుడు ఆ పార్టీ చెబుతున్న గాంధేయవాదానికి ఏ మాత్రం సంబంధం లేదు. అయినా చంద్రబాబు నాయుడు హడావుడి చేయబోతున్నారు.
ఇంతకీ ఈ ధర్నాకు పవన్ కల్యాణ్ మద్దతును ఇవ్వబోతున్నారా? అంటే..బహుశా మద్దతు ఉండొచ్చనే అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. తనకు చంద్రబాబు నాయుడు మద్దతు పలికిన నేపథ్యంలో పవన్ ఆయన ప్రొగ్రామ్ కూ మద్దతు పలకవచ్చు. ఇలా తమ బంధాన్ని బహిరంగంగానే చాటే అవకాశాలున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.