సున్నితమైన రాజకీయ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య ఆసక్తికరంగా ఉండటంతో పాటు.. కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టులా మారింది. అరుణాచల్ ప్రదేశ్ లో చోటు చేసుకున్న రాజకీయ సంక్షోభం.. దీనికి పరిష్కారంగా కాంగ్రెస్ తిరుగుబాటు నేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్ లో అక్కడి గవర్నర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని.. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై స్టే ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును కాంగ్రెస్ పార్టీ ఆశ్రయించింది.
దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్య ఒకటి చేసింది. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పుల్ అంశం కానీ రాజ్యాంగ విరుద్ధమని తేలిన పక్షంలో ‘గడియారాన్ని వెనక్కి కూడా తిప్పగలం’ అంటూ కీలక వ్యాఖ్య చేసింది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై స్టే ఇవ్వాలన్న కాంగ్రెస్ పార్టీ నేతల వాదనపై స్పందించిన సుప్రీం ధర్మాసనం.. ఎక్కువ అంశాలతో విషయాన్ని కలగాపులగం చేయొద్దని.. ఇలా చేస్తే అంశాల్నివర్గీకరించటం కష్టమవుతుందని వ్యాఖ్యానించింది. అవసరమైతే పరిస్థితిని సరి చేయగలమని మీకు తెలుసు కదా అంటూ.. బొమ్మయ్ కేసు తీర్పు చదవలేదా? అంటూ ప్రశ్నించి కాంగ్రెస్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది నారిమన్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది.