కరోనా వేళ అన్ని సందేహాలే. అన్ని అనుమానాలే. ఎందుకంటే.. ఈ పిశాచి వైరస్ కంటికి కనిపించదు. భూతద్దం వేసుకొని చూసుకున్నా.. కనిపించనంత చిన్నది. సూదిమొన మీదనే కోట్లాది కరోనా వైరస్ కొలువు తీరి ఉండే సత్తా దాని సొంతం. అలాంటి అతి సూక్ష్మమైన వైరస్ మనిషి మీద పగబట్టిన వేళ.. దాని అంతు చూసేందుకు మనిషి చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. తన మానాన తాను ఉండకుండా.. ప్రపంచం మొత్తాన్ని ఆగమాగం చేస్తున్న కరోనా కారణంగా దేశాలకు దేశాలు లాక్ డౌన్ లో ఉన్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం దేశంలో 21 రోజుల కరోనా లాక్ డౌన్ నడుస్తోంది. ఇలాంటివేళ.. ఇంట్లో ఉన్న చాలామందిలో కొత్త.. కొత్త సందేహాలు వస్తున్నాయి. తమకు వచ్చిన సందేహాల్ని తీర్చుకోవటానికి అందుబాటులో ఉన్న మాథ్యమాల్ని చూస్తున్నా.. కొన్నింటి విషయాల్లో క్లారిటీ రాని పరిస్థితి. దీంతో.. సందేహం అంతకంతకూ ఎక్కువైపోయి.. ఆందోళనకు గురి అవుతున్నోళ్లు చాలామందే ఉన్నారు.
తాజాగా ఇంట్లో ఉన్న వారికి ఒక డౌట్ విపరీతంగా వేధిస్తోంది. ఇవాల్టి రోజున ఇళ్లల్లో ఈగలతో పోలిస్తే.. దోమలు చాలా ఎక్కువ. వీటి కారణంగా ఇప్పటికే పలు జబ్బులు రావటం తెలిసిందే. బుల్లిగా ఉండే ఇవి మనిషిని కుట్టినప్పుడు ఆగమాగం రావటం.. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు తీసేసే వరకూ వెళ్లటం తెలిసిందే. ఇలాంటి వేళ.. దోమకాటు కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందే వీలుందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
ఇదే విషయం అంతకంతకూ పెరిగి.. చాలామందికి ఈ సందేహం వస్తుండటంతో తాజాగా కేంద్రం ఒక క్లారిటీ ఇచ్చేసింది. దోమకాటు కారణంగా ఈ వైరస్ వ్యాప్తి చెందదని స్పష్టం చేసింది. అదే సమయంలో ఈగతో కూడా వ్యాపించే అవకాశం లేదంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రతి రోజు వెల్లువెల్లి.. అల్కహాల్ (మందు) తాగటం వల్ల కరోనా రాదన్న వాదన కూడా సరికాదని.. అదంతా ఉత్త అబద్ధంగా స్పష్టం చేశారు. సో.. అలా వస్తుందో..? ఇలా వస్తుందో? అన్న సందేహాల్ని వదిలేసి.. ఎంచక్కా ఇంట్లో నుంచి బయటకు రాకుంటే చాలు.. కరోనా వైరస్ వచ్చే అవకాశమే లేదన్న విషయాన్ని వదిలేసి.. లేని సమస్యల్ని మీదేసుకోవటం ఏమిటో..?