ఈ రైతు చేసే సాహసం మీరు చేయగలరా..?

Update: 2022-04-11 23:30 GMT
దేశానికి వెన్నెముక రైతు అన్నారు పెద్దలు. దీనిని భట్టి తెలుస్తోంది. మన దేశానికి రైతు ప్రాధాన్యత ఏంటోనని..  రైతు లేనిది ఆహారం లేదు..రైతు కష్టపడనికి బుక్కుడు కూడు పుట్టదు.. నాటి నుంచి నేటి వరకు దేశానికి నడిపించే రైతన్నకు చాలా ప్రభుత్వాలు.. సంస్థలు ప్రోత్సాహాన్నిస్తున్నాయి..రైతు బావుంటేనే తమ ప్రభుత్వం బావుంటుందని ఎన్నో ప్రభుత్వాలు భావిస్తాయి.

అందుకే మొదటి ప్రాధాన్యత రైతుకే ఇస్తాయి. అయితే మారుతున్న కాలంతో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతోంది. దీంతో రైతులు స్థానంలో మిషన్లు పుట్టుకొస్తున్నాయి. పది మంది రైతులు చేసే పనిని ఒక మిషన్ చేస్తుంది. దీంతో రైతు ప్రాధాన్యత తగ్గిపోతుంది.కొన్ని ప్రభుత్వాలు కూడా మిషనరీని ప్రోత్సహించడంతో రైతులు ఉనికిని కోల్పోతున్నారు.

కానీ రైతు కష్టం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. విత్తనం నాటే దగ్గరి నుంచి ధాన్యం సేకరణ వరకు కాలే కడుపును చేతబట్టుకొని శ్రమిస్తాడు. ఫలితం ఎలా ఉన్నా అనుకున్న పనిని పూర్తి చేసి దేశానికి ఆహారం అందిస్తాడు. కష్టనష్టాలు ఎన్ని ఎదురైనా ధాన్యం అందించే వరకు విశ్రమించడు. అలాంటి రైతు ప్రాధాన్యతను పదేళ్ల నుంచి ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టి వారిని ప్రోత్సహిస్తున్నాయి. 21 శతాబ్దం ప్రారంభంలో రైతు ప్రాధాన్యత కోల్పోయినా.. కొన్ని ప్రభుత్వాలు వారిని గుర్తించడంతో అన్నదాతలు మనుగడ సాధిస్తున్నారు.

అయితే వారసత్వంగా ఆస్తులు, సంపదను పొందుతున్న కొందరు నేటి యువకులు వ్యవసాయం చేయడానికి మాత్రం ఇంట్రెస్టు పెట్టడం లేదు. ఫలితంగా వ్యవసాయం రాను రాను తగ్గిపోతుంది. దీంతో ధాన్యం రేటు పెరిగిపోతుంది. పాశ్చాత్యపోకడలకు అలవాటు పడ్డ చాలా మంది యువకులు ఖాళీగా ఉంటున్నారు తప్ప వ్యవసాయాన్ని గుర్తించడం లేదు. వ్యవసాయంతోనే మన బతుకులు మందుకు సాగుతాయని అనుకోవడం లేదు. దీంతో వ్యవసాయం చేయడానికి ఇంట్రెస్టు పెట్టడం లేదు.

కానీ వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు ఎంత కష్టం వచ్చినా వెనుకాడడం లేదు. అందుకు ఓ రైతు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈరోజుల్లో చిన్న గాయమైతే వారం రోజుల పాటు ఇంట్లో విశ్రాంతి తీసుకునేవాళ్లు చాలా మందే ఉన్నారు. అలాంటింది ఓ రైతు తనకు ఓ కాలు లేకున్నా నిబద్ధతతో వ్యవసాయం చేయడాన్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

ఒంటికాలుతో వ్యవసాయం పనులు చేస్తున్న ఆ రైతు వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది. 'రైతన్నా.. నీకు వందనం' అంటూ కామెంట్లు పెట్టి హల్ చల్ చేస్తున్నారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న ఈ రైతును చూసి  చాలా మంది నేర్చుకోవాలని అంటున్నారు.


Full View




Tags:    

Similar News