కెనడా కుర్రాడి డిఫరెంట్ లవ్ ప్రపోజల్

Update: 2016-08-20 17:30 GMT
దాదాపుగా ప్రతీ మగవాడి జీవితంలో ప్రేమ అనే అధ్యాయంలో - తాను ప్రేమించిన అమ్మాయికి.. తన ప్రేమను వ్యక్తం చేయడం అనేది అతిపెద్ద ఖఠినమైన పరీక్ష అనే చెప్పుకోవాలి. ఈ వార్త చదువుతున్నప్పుడు ఎవరి అనుభవాలలోకి వారు వెళ్తే.. ఇది నిజమే కదా అనిపించకమానదు. ఈ విషయంలో ఇప్పటికే ప్రతిఒక్కరూ ఎవరి స్థాయిలో వాళ్లు ప్రణాలికలు వేసుకుని - పరీక్షలు రాసినవారే. అయితే వారిలో కొంతమంది ఫస్ట్ క్లాస్ లో పాసయితే - మరి కొందరు బిలో థర్టీఫైవ్ పెర్సంటేజ్ వచ్చి ఫెయిల్ అయ్యారు. అయితే ఈ విషయంలో పాస్ అయినవారి అనుభవాలు మాత్రం ఒక్కొక్కరిదీ ఒక్కోరకంగా - అద్భుతంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి కూడా ఇలా భిన్నంగానే ఆలోచించినవాడే. అయితే అతడు ఈ పరీక్షలో పాసయ్యాడా లేక ఫెయిల్ అయ్యాడా అనేది ఇప్పుడు చూద్దాం...

మనసారా ప్రేమించిన ప్రియురాలికి తన మనసులోని మాటను చెప్పాలని నిర్ణయించుకున్నాడు కెనడాలోని మనిటోబా ప్రాంతానికి చెందిన జాన్ యోకిమోస్. ఇతడు కొన్ని రోజులుగా తన స్నేహితురలైన షాలీ అనే అమాయిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమెకు ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతున్నాడు. చెప్పినప్పుడు "ఐ టూ" అంటే ఏ గొడవా లేదు.. అదేగనక "సారీ" అంటే.. మొదటికే మోసం వస్తుంది - ఉన్న స్నేహం కూడా.. పోతుంది అని భావించి.. ఆఖరికి ఒక నిర్ణయం తీసుకున్నాడు.

ఈ విషయంపై దాదాపు నెలరోజులుగా ప్లాన్ రెడీ చేసుకున్న యోకిమోస్‌.. తన ప్రియురాల్ని తీసుకొని విమాన ప్రయాణానికి వెళ్లాడు. విమానం అలా మబ్బుల్లో విహరిస్తున్న సమయంలో కిందకు చూసిన షాలీకి భువిపై తన పేరిట ఒక లవ్‌ ప్రపోజల్‌ కనిపించింది. ఆ ప్రపోజల్ ని పరిశీలించిన ఆమె ఒక్కసారిగా షాక్ కి గురైంది. ఎందుకంటే.. మొక్కజొన్న పొలంలో "ఐ లవ్‌ యూ షాలి.. విల్‌ యూ మ్యారీ మీ?" అనే పెద్ద పెద్ద అక్షరాలతో దాన్ని రాశారు. ఆశ్చర్యంగా దానివైపు చూసిన షాలీకి... అది రాసింది తానేనని, అది చూపించడానికే విమానం ఎక్కించానని తన కళ్లతోనే యోకిమోస్ చెప్పడంతో వెంటనే తన ప్రేమకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది.

ఈ స్థాయిలో ప్రేమించేవాడు దొరికాడనే సంబరంలో విమానంలో ప్రయాణిస్తున్న అందరి సమక్షంలో వెంటనే తన ప్రియుడికి ఉంగరం తొడిగేసింది షాలి. కథ సుఖాంతం అవటంతో 2017లో పెళ్లిపీటలెక్కేందుకు ఈ జంట సిద్దమవుతుంది. ఈ డిఫరెంట్ ప్రపోజ్ కోసం మనోడు నెలరోజులుగా కష్టపడుతున్నాడట.
Tags:    

Similar News