కేజ్రీవాల్ పార్టీని ఈసీ రద్దు చేస్తుందా?

Update: 2017-02-03 06:54 GMT
ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికల్లో ఒకట్రెండు రాష్ట్రాల్లో తమ సత్తా చాటాలని.. బీజేపీకి షాకివ్వాలని తపిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే పరిణామం ఒకటి ఎదురైంది. మరో రోజు వ్యవధిలో గోవా.. పంజాబ్ రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అక్కడ పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీపై ఆదాయపన్ను శాఖ భారీ ఫిర్యాదు చేయటమే కాదు.. రాజకీయ పార్టీగా ఉన్న హోదాను రద్దు చేయాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించినట్లుగా తెలుస్తోంది.

ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికల్లో గోవా.. పంజాబ్ రాష్ట్రాల్లో ఈసారి తానేమిటో చూపించాలన్న తహతహను కేజ్రీవాల్ ప్రదర్శిస్తున్నారు. అయితే.. రూ.27 కోట్ల విరాళాలకు సంబంధించిన తప్పుడు ఆడిట్ నివేదికను ఆ పార్టీ సమర్పించిందని.. అందుకే.. ఆ పార్టీ హోదాను రద్దు చేయాల్సిందిగా ఐటీ శాఖ కోరింది.

2013-14.. 2014-15 లలో తప్పుడు.. కల్పిత ఆడిట్ నివేదికల్ని ఆ పార్టీ సమర్పించిందని.. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న ‘ట్రస్టు.. రాజకీయ పార్టీ’’ హోదాను పున:సమీక్షించాలని.. హోదాను రద్దు చేయాలని సిఫార్సు చేస్తూ ఎన్నికల సంఘాన్ని ఐటీ శాఖ కోరింది. మరి.. దీనిపై ఈసీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్నికల పోలింగ్ కు కీలకమైన ఒక రోజు ముందు బయటకు వచ్చిన ఈ వ్యవహారంపై ఈసీ నిర్ణయం కీలకం కానుంది.  

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News