జ‌గ‌న్ మాతృమూర్తి విజ‌య‌మ్మ ట్ర‌స్టుకు కేంద్రం బ్రేక్‌!

Update: 2022-11-18 12:30 GMT
కేంద్రంలోని న‌రేంద్ర‌మోడీ స‌ర్కారుతో తాము ప్ర‌త్యేక‌మైన బంధాన్ని, అనుబంధాన్ని కొన‌సాగిస్తున్నామ‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ విశాఖ‌ప‌ట్నంలో నిర్వ‌హించిన స‌భ‌లో మోడీ స‌మ‌క్షంలో చెప్పిన విష‌యం తెలిసిందే. ఇది జ‌రిగి నాలుగు రోజులు కూడా తిర‌గ‌కుండానే కేంద్ర ప్ర‌భుత్వం జ‌గ‌న్ కుటుంబానికి భారీ షాక్ ఇచ్చింది. సీఎం మాతృమూర్తి, దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స‌తీమ‌ణి వైఎస్ విజ‌య‌మ్మ నిర్వ‌హిస్తున్న ''విజ‌య‌మ్మ చారిట‌బుల్ ట్ర‌స్ట్‌' అనుమ‌తులు ర‌ద్దు చేసింది.

దీంతో ఆ సంస్థ సుప్త‌చేత‌నావ‌స్థ‌కు చేరింది. వైఎస్ మ‌ర‌ణాంత‌రం, ఆయ‌న పేరుతో విజ‌య‌మ్మ కొన్ని కార్య క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. ఎక్కువ‌గా క‌డ‌ప‌, హైద‌రాబాద్ శివారు ప్రాంతాల్లోని పేద‌లకు విద్య‌, పుస్త‌కాలు, వ‌స్త్రాల‌ను అందిస్తూ వారిని ఆదుకుంటున్నారు.

దీనికి సంబంధించి విదేశాల నుంచి కూడా ఎఫ్ ఆర్ సీఎస్ చ‌ట్టం 2010 కింద  నిధులు కూడా స‌మీక‌రిస్తున్నారు. ఈ నిధుల‌తో ఆయా సేవ‌లు కొన‌సాగిస్తున్నారు. అయి తే, దీనికి పెద్ద‌గా ప్ర‌చారం లేదు. కేవ‌లం మిష‌న‌రీ త‌ర‌హాలో ఒక వ‌ర్గానికి మాత్ర‌మే అందుతున్నాయి.

ఇదిలావుంటే, ఫారిన్ నుంచి వ‌చ్చే విరాళాల‌కు సంబంధించి ప్ర‌తి సంవ‌త్స‌రం మార్చి-ఏప్రిల్‌మ‌ధ్య‌లో కేంద్ర ఆర్థిక‌, హోం శాఖ‌ల‌కు నివేదిక‌లు అందించాలి. ఎంత మొత్తం నిధులను విదేశాల నుంచి సేక‌రిస్తు న్నారు? ఏయే సంస్థ‌లు ఇస్తున్నాయి?  వాటిని ఎవ‌రెవ‌రికి ఖ‌ర్చు చేస్తున్నారు? అనే వివ‌రాల‌ను అందించా లి. అయితే, ఈ వివ‌రాల‌నువ‌రుస‌గా మూడేళ్ల నుంచి అందించ‌ని సంస్థ‌ల‌పై కేంద్ర హోం శాఖ కొర‌డా ఝ‌ళిపిస్తోంది.

ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షురాలు ఎంపీ సోనియాగాంధీ చైర్మ‌న్‌గా ఉన్న‌రాజీవ్ చారిట‌బుల్ ట్ర‌స్ట్ స‌హా వారికే చెందిన మ‌రో సంస్థ లైసెన్సును కూడా కేంద్రం ర‌ద్దు చేసింది. ఇక‌, ఇప్పుడు విజ‌య‌మ్మ వంతు వ‌చ్చింది.

ఈ చారిటబుల్ ట్ర‌స్టు కూడా వివ‌రాలు వెల్ల‌డించ‌ని కార‌ణంగా ర‌ద్దు చేస్తున్న‌ట్టు హొం శాఖ తాజాగా పేర్కొంది. దీనితోపాటు, తెలంగాణ‌లో 90, ఏపీలో 168 స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌ను ర‌ద్దు చేయ‌డం గ‌మ‌నార్హం.  



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News