వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అభ్యర్థి!

Update: 2019-04-12 05:55 GMT
ఏపీ ఎన్నికల చరిత్రలోనే ఎన్నడూ లేనంత స్థాయిలో ఈ సారి  ఎన్నికల వ్యయాన్ని పెట్టారు అభ్యర్థులు. ఇది ఎవరూ కాదనలేని అంశం. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి ఎన్నికలు మరింత వ్యయభరితం అయ్యాయి. అభ్యర్థులు కోట్ల రూపాయల మొత్తాలను విచ్చల విడిగా ఖర్చు పెట్టారు. ఇదంతా స్పష్టం అవుతున్న విషయమే.

అయితే అలా విచ్చల విడిగా ఖర్చు పెట్టిన అభ్యర్థులు ఒక ఎత్తు అయితే.. ఒకే ఒక అభ్యర్థి ది మరో ఎత్తు అని విశ్లేషకులు అంటున్నారు.  రాజకీయాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన సదరు అభ్యర్థి ఏకంగా వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తోంది. వంద కోట్ల రూపాయలు. ఇది ఒక అభ్యర్థి ఎన్నికలను ఎదుర్కొనడానికి పెట్టిన ఖర్చు అంటే ఆశ్చర్యం కలగక మానదు.

సాధారణంగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు లక్షల ఓట్లు ఉంటాయి. వారిలో ఒక్కోరికి వెయ్యి రూపాయలను ఖర్చు పెట్టినా అయ్యే ఖర్చు ఇరవై కోట్ల రూపాయలే. అయితే సదరు అభ్యర్థి సగటున ఒక్కో ఓటర్ మీద ఐదు వేల రూపాయల వరకూ ఖర్చు పెట్టారని.. అంచనా వేయవచ్చు.

ఎన్నికల ప్రచారానికి - ప్రలోభాలకు డబ్బులు చిల్లాడాడు అని.. దీంతో వ్యయం వంద కోట్ల రూపాయల మార్కును అందుకుందని సమాచారం. అలా ఖర్చు పెడుతున్న ఆ అభ్యర్థిని చూసి.. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ప్రత్యర్థి చాలా భయపడ్డాడు అట. అయితే అంత ఖర్చు పెట్టినా.. పోలింగ్ తర్వాత కూడా పరిస్థితి పోటా పోటీగా ఉందనే విశ్లేషణలే వినిపిస్తూ ఉండటం విశేషం!




Tags:    

Similar News