నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని రైతులు తమకు న్యాయం జరగాలని మరోమారు గళం వినిపించారు. ప్రభుత్వం తరఫున నిర్వహించే సదస్సులకు అధికారులు డుమ్మా కొట్టడం, సరైన సమాచారం లేకపోవడం వంటివి చేస్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేసి సమావేశాన్ని బహిష్కరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి సీఆర్ డీఎ కార్యాలయంలో భూ సమీకరణ కోసం అధికారులు సదస్సు ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశం ఉదయం 11 గంటలకు ఉండగా...సమాచారాన్ని ఉదయం 8 గంటలకు అందించారు. అది కూడా రైతుల ఫోన్ లకు మెసేజ్ పంపించడం ద్వారా! దీంతో ప్రభుత్వం, అధికారుల తీరుతో కడుపు మండిపోయిన రైతులు సీఆర్ డీఏ నిర్వహించిన సదస్సును మరోసారి బహిష్కరించారు.
రాజధాని కోసం భూములను పూలింగ్ లో ఇవ్వబొమని ఎన్నిసార్లు చెప్పాలని అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఉదయం 11 గంటలకు సమావేశం ఉందని 8 గంటలకు సమాచారం పంపిస్తే తామెలా రావాలని అధికారులను రైతులు ప్రశ్నించారు. గత సమవేశానికి వచ్చిన అధికారులు ఈ సమావేశానికి రాకపోవడంపైనా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సమావేశానికి అధికారుల మార్పు వలన తమకు గతంలో ఇచ్చిన హామీలను ప్రస్తావించడానికి వీల్లేకుండా పోతోందని, భూములు ఇచ్చే రైతులంటే ఇంత చులకన భావం ఎందుకని సూటిగా ప్రశ్నించారు. సరైన అధికారాలు లేకుండా రైతులను భయభ్రాంతులను చేయడానికి సమావేశాలు నిర్వహిస్తున్నారని రైతులు విమర్శించారు. తమ భూములు ఎట్టి పరిస్థితుల్లోనూ పూలింగ్‌లో ఇచ్చేది లేదని తేల్చిచెప్పిన రైతులు సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. దీంతో షాక్ తినడం అధికారుల వంతు అయింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/