విద్యార్థినులపై లైంగిక దాడి..: ప్రిన్సిపాల్ సహా 9 మంది టీచర్లపై కేసు

Update: 2021-12-13 08:50 GMT
విద్యాబుద్దులు చెప్పాల్సిన ఆ టీచర్లు కామ కోరికలు తీర్చుకుంటుననారు.. భవిష్యత్ లో ఉన్నత స్థితిలో ఉండేందుకు చదవునేర్చుకునేందుకు వస్తున్న వారిపై లైంగిక దాడి చేస్తున్నారు. అభం, శుభం తెలిసిన ఆడపిల్లలపై కామాంధులు రెచ్చిపోతున్నారు. అయితే సాటి ఆడపిల్లలపై ఇంతటి ఘోరం జరగుతున్నా.. లేడీ టీచర్లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

అంతేకాకుండా ఆ స్కూల్ ప్రిన్సిపాల్ తో సరసాలాడుతూ వారి అచ్చటా..ముచ్చటా తీర్చుకుంటున్నారు. అయితే ఓ విద్యార్థిని, తాను చచ్చినా పర్వాలేదు.. స్కూలుకు మాత్రం వెళ్లను.. అని గట్టిగా చెప్పడంతో విద్యార్థినిని ఏం జరిగిందో చెప్పాలని అడిగారు. దీంతో విద్యార్థిని అసలు విషయం చెప్పడంతో ఘోరాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కరోనా కారణంగా పాఠశాలలన్నీ మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే పూర్తిగా తెరుచుకుంటున్నాయి. ఇన్నాళ్లు వెనుకబడిన తమ చదువును ఇప్పడిక గాడిలో పెట్టాలని ఎంతో ఆశతో విద్యార్థులు పాఠశాలలకు వస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థినులను ఏకంగా స్కూల్ ప్రిన్సిపాల్ ఈ ఘోరానికి పాల్పడడం గమనార్హం.

రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలోని ఓ ప్రభుత్వ హైస్కూల్ లోకి విద్యార్థులు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. టీచర్లు కూడా 100 శాతం హాజరై పాఠాలు చెబుతున్నారు. అయితే స్కూల్ ప్రిన్సిపాల్ తో పాటు కొందరు టీచర్లు విద్యార్థులను చూసి పాడు చేయాలని అనుకున్నాడు.

8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని ఓ టీచర్ గదిలోకి ఒంటరిగా రమ్మని ఆదేశించాడు. దీంతో ఆ టీచర్ విద్యార్థినిపై లైంగికంగా దాడి చేశాడు. ఆ విషయం తెలుసుకున్న మరికొంతమంది టీచర్లు అదే అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అయితే ఈ స్కూల్ లో మహిళా టీచర్లు కూడా ఉన్నారు. వారికి ఈ విషయం తెలిసినా చూసీ చూడనట్లుగా ఉన్నారు.

అంతేకాకుండా లక్షల్లో జీతాలు తీసుకుంటూ చదువు చెప్పకుండా సదరు టీచర్లతో కాలక్షేపం చేయసాగారు. కొందరు ఆ టీచర్లతో ఒకడగు ముందుకేసీ పడకగదిని కూడా పంచుకున్నారు. ఇవే కాకుండా లేడీ టీచర్లు ప్రిన్సిపాల్ ఇంట్లో మందు పార్టీతో సందడి చేశారు. ఇక్కడ కొందరు అమ్మాలను పిలపించుకుని ప్రిన్సిపాల్ వారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు.

ఇదిలా ఉండగా 10వ తరగతి చదువుతున్న ఓ అమ్మాయి స్కూల్ కు వెళ్లడం మానేసింది. ఇంట్లోనే ఎక్కువ రోజులు ఉండడంతో తల్లిదండ్రులు మందలించారు. పదే పదే అడుగుతుండడంతో అసలు విషయం చెప్పింది.

తనపై ముగ్గురు టీచర్లు లైంగిక దాడికి పాల్పడ్డారని అమ్మాయి తన తండ్రితో చెప్పింది. దీంతో అమ్మాయి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. 10వ తరగతితో పాటు 6వతరగతి, 4వ తరగతి, 3వ తరగతి చదువుతున్న మరో ముగ్గురు అమ్మాయిలపై లైంగిక దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రపింది.

అయితే కొందరు టీచర్లు ఫ్రీగా పుస్తకాలు, నోట్ బుక్ లు ఇస్తామని, అసలు విషయం చెప్పొద్దని టీచర్లు అన్నారని విద్యార్థులు పోలీసులకు తెలిపారు. మరికొందరు ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని కూడా బెదరించారని వాపోయారు.

దీంతో విచారణ జరిపిన పోలీసలు స్కూల్ ప్రిన్సిపాల్ సహా 9 మంది టీచర్లపై కేసులు నమోదు చేసినట్లు మంధనా పోలీస్ స్టేసన్ అధికారి ముఖేశ్ యాదవ్ మీడియాకు తెలిపారు. అయితే కొందరు ప్రిన్సిపాల్ సోదరుడు మంత్రి అని తనని ఎవరూ ఏం చేయలేరని చెప్పడం దూమారం లేపినట్లయింది. కాగా స్కూల్ లో అలాంటివేమీ జరగలేదని ఆ ప్రిన్సిపాల్ తెలిపారు.
Tags:    

Similar News