ఇటీవల సుప్రీంకోర్టు విడుదల చేసిన ఆదేశాల ఆధారంగా సినిమా థియేటర్లలో జాతీయ గీతం ఆలపించడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. కుటుంబం, స్నేహితులతో కలిసి సినిమా చూడటం దేశభక్తికి పరీక్షా వేదికగా కావొద్దని పవన్ తన ట్వీట్లలో పేర్కొన్న సంగతి తెలిసిందే. సినిమా హాళ్ల లో జాతీయ గీతం పాడడం ఫై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై జాతి ద్రోహం కింద కేసు పెట్టాలని సరూర్ నగర్ పోలీసులకు సుంకరి జనార్దన్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. భారత దేశాన్ని కించపర్చేలా పవన్ వ్యవహరించారని పేర్కొంటూ జాతి ద్రోహం కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు దారుడు కోరారు. ఉన్నతాధికారుల సలహా మేరకు తగు నిర్ణయం తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
కాగా పవన్ తన ట్వీట్లలో దేశభక్తికి సంబంధించి ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దేశాన్ని గౌరవించడంలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని పేర్కొంటూ ఆయా పార్టీల విధానాల ఆధారంగా దేశభక్తిని అంచనా వేయవద్దని పవన్ సూచించారు. థియేటర్ల జాతీయ గీతాన్ని గౌరవించడం పరీక్ష కావద్దని కోరారు. రాజకీయ పార్టీలు సమావేశాలను జాతీయ గీతాలాపనతో ఎందుకు ప్రారంభించవని ప్రశ్నించారు. చట్టాలను చేసేవారు, వాటి గురించి ప్రచారం చేసేవారు.. వారెందుకు ఆచరించరు? ఆచరించి అందరికీ ఆదర్శంగా నిలవొచ్చు కదా.. అని పవన్ సూటిగా నిలదీశారు. ఈ సందర్భంగా పార్టీలన్నింటిపై పవన్ సెటైర్ వేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసు నమోదైంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/