కూక‌ట్‌ ప‌ల్లి పీఎస్‌ లో అశ్వ‌త్థామ‌రెడ్డిపై కేసు...అనుమానాలు

Update: 2019-10-25 09:41 GMT
ఆర్టీసీ జేఏసీ నేత అశ్వ‌త్థామ‌రెడ్డి పై కేసు న‌మోదు అయింది. ఆర్టీసికి చెందిన డ్రైవ‌ర్ రాజు చేసిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు. కూక‌ట్‌ ప‌ల్లి పోలీస్‌ స్టేష‌న్ లో అశ్వ‌త్థామ‌రెడ్డిపై రాజు ఫిర్యాదు చేయ‌గా - కేసు న‌మోదు అయింది. ఆర్టీసీ స‌మ్మెకు అశ్వ‌త్థామ‌రెడ్డి కార‌ణ‌మ‌ని, అందుకే  ఆర్టీసీ కార్మికులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని రాజు త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్టీసీ జేఏసీ క‌న్వీన‌ర్‌ అశ్వ‌త్థామ‌రెడ్డి నేతృత్వంలో ఆర్టీసీ స‌మ్మె 21రోజులుగా ఉధృతం గా జ‌రుగుతోంది. ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా ప్రారంభ‌మైన ఈ స‌మ్మెపై అటు ప్ర‌భుత్వం - ఇటు ఆర్టీసీ కార్మికులు మెట్టు దిగ‌డం లేదు.

ఇద్ద‌రు పంతం ప‌ట్ట‌డంతో స‌మ్మె కొన‌సాగుతూనే ఉంది. అయితే కొంద‌రు కార్మికులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. దీనికి అశ్వ‌త్థామ‌రెడ్డి కార‌ణ‌మ‌నే ఆరోప‌ణ‌ల‌తో డ్రైవ‌ర్ రాజు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే ఈ కేసుపై ఆర్టీసీ సంఘాల నాయ‌కులు, కార్మికులు పెద‌వి విరుస్తున్నారు. ఈ కేసును తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టించిందే అని ఆరోపిస్తున్నారు. ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా వెన‌క్కి త‌గ్గేది లేద‌ని కార్మికులు అంటున్నారు.

ఎన్ని కేసులు పెట్టినా ఉద్య‌మిస్తూనే ఉంటామ‌ని, కేసీఆర్ కావాల‌ని కార్మికుల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురి చేసేందుకు ఇలాంటి త‌ప్పుడు కేసులు పెట్టిస్తున్నార‌ని కార్మికులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆర్టీసీ జేఏసీ నేత అశ్వ‌త్థామ‌రెడ్డి కేసులు పెడితే ఆర్టీసీ కార్మికుల చావుల‌కు తెలంగాణ స‌ర్కారు - సీఎం కేసీఆర్ కార‌ణ‌మ‌ని మేము కేసులు పెడ‌తామ‌ని కార్మికులు హెచ్చ‌రిస్తున్నారు. తెలంగాణ స‌ర్కారు ఆర్టీసీ స‌మ్మెను నిర్వీర్యం చేసేందుకు కుట్ర‌లు ప‌న్నుతున్నార‌న్న విమ‌ర్శ‌లు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News