కుప్పంలో అన్ని మండలాలు, పంచాయతీలు, ఆఖరుకు మునిసిపాలిటీలు గెలిచేశామని మాటకు వస్తే వైసీపీ అధినాయకత్వం మురిసిపోతుంది. సమీక్షా సమవేశాల్లో అధినేత జగన్ అయితే కుప్పం కోటను బద్దలు కొట్టడానికి ఇక అడుగు దూరంలోనే ఉన్నామని చెబుతున్నారు. చంద్రబాబు ఈసారి మాజీ ఎమ్మెల్యే కావడమే మన టార్గెట్ అంటూ అక్కడ నేతలకు ఒకటికి పదిమార్లు చెబుతున్నారు. ఈ మధ్యన చూస్తే కుప్పానికి వెళ్ళిన ముఖ్యమంత్రి ఏకంగా 66 కోట్లకు పైగా అభివృద్ధి పనులను శ్రీకారం చుట్టారు.
మరి కుప్పానికి ఇన్ని కోట్లు కేటాయిస్తే మునిసిపల్ సర్వసభ్య సమావేశంలో గెలిచిన వైసీపీ కౌన్సిలర్లు ఎందుకు ఏడుపు ముఖాలు పెడుతున్నారు. ఏకంగా కుప్పం మునిసిపాలిటీ వైస్ చైర్మన్ మునుస్వామి అయితే ఏ ఒక్క పనీ జరగడంలేదని చెప్పి సమావేశాన్ని ఎందుకు బహిష్కరిస్తారు. అంటే కుప్పం అసలు గుట్టు ఇదన్న మాట.
తాజాగా జరిగిన కుప్పం మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశానికి కుప్పం మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్ దేవకి భర్త రంగయ్య హాజరయ్యారు. ఆయనను ఎలా సమావేశానికి అనుమతించారు అన్నది కాస్తా పక్కన పెడితే రంగయ్య అక్కడ తన మనసులోని తీవ్ర అసంతృప్తిని అలా బయటపెట్టేసుకున్నారు. మేము జనంలోకి వెళ్ళి పనులు చేయాలి కదా తమకు ఎలాంటి పనులు ఇవ్వకపోవడమేంటి అని నేరుగా కమిషనర్ ని నిలదీశారు. అయితే దానికి కమిషనర్ కూల్ గా ఎనిమిది వందల రూపాయల పనులకు బిల్లులు ఇచ్చాం కదా అని చెప్పారు.
అయితే మండిపోయిన రంగయ్య ఏ మూలకు ఎనిమిది వందల రూపాయలు అండీ. మేము ఒక్కో ఓటుని ఏకంగా ఒక్కో ఓటుకూ ఏకంగా అయిదు వేల రూపాయలు ఖర్చు చేశామని చెప్పడమే ఇపుడు సర్వత్రా చర్చ అవుతోంది. అంటే చంద్రబాబు మీద తీవ్ర వ్యతిరేకత వైసీపీ మీద పూర్తి స్థాయిలో ప్రేమ పొంగిపోయి కుప్పంలో ఆ పార్టీ గెలవలేదు అని అర్ధమవుతోంది. రంగయ్య చెప్పిన మాటలను బట్టి చూస్తే బాబు గారి పార్టీని ఓడించినది క్యాష్ తప్ప వైసీపీ గాలి కాదని కూడా అర్ధమైపోతోంది
ఇక ఇదే సమావేశంలో మరో తమాషా చోటు చేసుకుంది. వైస్ చైర్మన్, వైసీపీకి చెందిన కీలక నేత మునుస్వామి ఏకంగా సమావేశాన్ని బహిష్కరించడం. ఆయన తాను మునిసిపాలిటీ పనుల కోసం పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నానని, దానికి వడ్డీలు ఇపుడు చెల్లించాల్సివస్తోందని మండిపడ్డారు. తన బిల్లుల చెల్లింపు కోసం ఏకంగా కోర్టుకే వెళ్ళి తేల్చుకుంటానని చెప్పి సమవేశాన్ని బాయ్ కాట్ చేయడం ఇపుడు హాట్ టాపిక్ అయినిద్. మరో వైపు టెండర్లు పిలిచినా అభివృద్ధి పనులు ప్రారంభం కాకపోవడంప్ పట్ల కుప్పం మునిసిపాలిటీ వైసీపీ ప్రజా ప్రతినిధులు రగిలిపోతున్నారు.
ఈ మొత్తం వ్యవహారాలు అన్నీ కూడా సోషల్ మీడియాలో హైలెట్ కావడంతో కుప్పంలో అసలు జరిగింది ఇదా. ఓటుకు అయిదు వేల రూపాయలు జస్ట్ కౌన్సిలర్ ఎన్నిక కోసం ఖర్చు చేశారంటే ఎంత భారీ మొత్తంలో డబ్బు పంచి కుప్పాన్ని గెలుచుకున్నారో కదా అని అంటున్నారు.
మొత్తం మీద కుప్పంలో అభివృద్ధి లేదు అన్నది ఒక వైపు తేలుతూంటే మరో వైపు ఈ లేటెస్ట్ వీడియో వైరల్ తో టీడీపీ మీద జనాల్లో వ్యతిరేకత లేదని, వైసీపీకి ఆదరణ కూడా లేదని తేలిపోయింది అంటున్నారు. అది కూడా వైసీపీ నాయకుల సాక్షిగానే రుజువు అయిందని తెలుగుదేశం నాయకులు ఇపుడు పండుగ చెసుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View
Full View Full View Full View Full View

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.