ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అత్యంత వివాదాస్పద - మొండి నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేందుకు అడుగులు పడ్డాయి. గోవధను నిషేధించాలన్న ఉద్దేశంతో ఇటీవల కేంద్ర ప్రభుత్వం పశు విక్రయాలపై అనేక మార్గదర్శకాలను సూచించింది. అయితే నిషేధంలో పేర్కొన్న కొన్ని అంశాలపై పునరాలోచన చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇవాళ సుప్రీంకోర్టుకు విన్నవించుకున్నది. తద్వారా పశు విక్రయాలపై రూపొందించిన కొత్త నియమావళి అంశంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
పశు విక్రయ నియమావళిలో కొన్ని సున్నితమైన అంశాలు ఉన్నాయని, ఆ రూల్స్ ను మార్చేందుకు పర్యావరణశాఖ ప్రయత్నిస్తున్నదని కేంద్రం సుప్రీంకోర్టుకు విన్నవించింది. పశు విక్రయ నిషేధం అంశంపై మద్రాసు కోర్టు ఇచ్చిన ఆదేశాలనే దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. మద్రాసు కోర్టులోని మదురై బెంచ్ ఇచ్చిన తీర్పును అమలు చేస్తే తమకు ఎటువంటి ఇబ్బంది లేదు అని కేంద్రం సుప్రీంకోర్టుకు వివరించింది. రూల్స్ అంశాన్ని మళ్లీ పునపరిశీలించిన మాత్రాన, ఆ చట్టాన్ని రద్దు చేయడం కాదు అని అడిషనల్ సొలిసిటర్ జనరల్ పీఎస్ నరసింహ తెలిపారు. పశు విక్రయాలపై పూర్తి స్థాయిలో సూత్రాలను సవరణ చేసే వరకు దాన్ని అమలు చేసే వీలు లేదని కోర్టు తేల్చి చెప్పింది. మే 26వ తేదీన పశు విక్రయాలపై కేంద్ర పర్యావరణ శాఖ కొత్త నిబంధనలతో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.