వాట్సాప్‌ లో చైల్డ్ పోర్నోగ్రఫీ

Update: 2018-02-23 23:30 GMT
డ‌బ్బు సంపాద‌నే ల‌క్ష్యంగా పెట్టుకునే నేటి యుగంలో పోర్నోగ్ర‌ఫీ రాజ్య‌మేలుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. రేయింబ‌వ‌ళ్లు నిద్రాహారాలు మాని డ‌బ్బు సంపాదిస్తున్నార‌ని - దాంతో వైవాహిక జీవితంలో అనేక మార్పులు చోటుచేస్తున్న‌ట్లు వైద్యులు చెబుతున్నారు. కొంద‌రు త‌మ వైవాహిక జీవితం ఉత్సాహంతో ఉండేందుకు పోర్నోగ్ర‌ఫీని ఆశ్ర‌యిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

అలాంటి వారిని టార్గెట్ ఎంచుకున్నఢిల్లీకి చెందిన  ఓ సంస్థ మూడు సంవ‌త్స‌రాలుగా పోర్నోగ్రాఫీని ప్ర‌పంచ‌దేశాల‌కు విస్త‌రించిన‌ట్లు బ‌ట్ట‌య‌లైంది.  అలా సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ (సీబీఐ) అంత‌ర్జాతీయ చైల్డ్ పోర్నోగ్ర‌ఫీ ముఠా గుట్టుర‌ట్టు చేసింది. చైల్డ్ పోర్నోగ్ర‌ఫీ ముఠా త‌న కార్య‌క‌లాపాల్ని కొన‌సాగిస్తుంద‌నే ప‌క్కా స‌మాచారంతో రంగంలో దిగిన సీబీఐ దేశ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో దాడులు చేసింది. ఆ దాడుల్లో ముంబైకి చెందిన జ్యువెల‌రీ షాపు య‌జ‌మాని కొడుకు నిఖిల్ వ‌ర్మను అదుపులోకి తీసుకుంది. కామ‌ర్స్ కోర్స్ లో డిగ్రీ చేస్తున్న నిఖిల్ వ‌ర్మ చైల్డ్ పోర్నో గ్ర‌ఫిని ప్రోత్స‌హిస్తున్న‌ట్లు విచార‌ణ‌లో తేలింది. నిందితుడు కిడ్స్ xxx  పేరుతో వాట్సాప్ లో గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ నుంచి పోర్నోగ్ర‌ఫీని విదేశాల‌కు విస్త‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అమెరికా - చైనా - న్యూజీలాండ్ - మెక్సికో - ఆఫ్ఘనిస్థాన్ - పాకిస్తాన్ - బ్రెజిల్ - కెన్యా - నైజీరియా - శ్రీలంకలతో సహా ప్రపంచవ్యాప్తంగా గ్రూప్ సభ్యులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు. అంతేకాదు ఈ గ్రూఫ్ లో 119మంది స‌భ్యులుగా ఉండ‌గా నిఖిల్ వర్మతో పాటు నఫీస్ రేజా - ఢిల్లీకి చెందిన జహీద్ - ముంబైకి చెందిన ఓం ప్రకాష్ చౌహాన్ - నోయిడాకు చెందిన ఆదర్శ్ ల‌ను అదుపులోకి తీసుకున్న‌ట్లు సీబీఐ ప్ర‌క‌టించింది.

వీరికి విధించే శిక్ష‌ను చిన్నారుల అశ్లీల వీడియోల‌ను టెక్నాల‌జీని ఉప‌యోగించుకొని రికార్డింగ్ చేయడం - అప్ లోడ్ చేయ‌డం - వాటిని ఇత‌ర దేశాల‌కు షేర్ చేయ‌డంపై సమాచార సాంకేతిక చట్టం కింద తీవ్రమైన నేరాలుగా గుర్తించి  ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10లక్షల వరకు జరిమానా విధించే అవకాశాలున్నాయని చెప్పారు.
Tags:    

Similar News