అక్రమాస్తుల కేసుల విచారణలో నిష్పక్షపాతంగా వహించి దేశవ్యాప్తంగా సీబీఐకి క్రేజ్ పెంచడమే కాకుండా...తన వైపు చూపుతిప్పుకున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణ మరోమారు వార్తల్లో నిలిచారు. ఈ దఫా శ్రీమంతుడిగా తెరమీదకు వచ్చారు. పాలమూరు జిల్లాలో చిన్నమందడి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీదేవి, గ్రామస్తులతో కలిసి లక్ష్మి నారాయణ చిన్నమందడిలో పర్యటించారు. ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసి అనంతరం కాలనీల్లో పర్యటించి సమస్యలను తెలుసుకోవడంతోపాటు, జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించి నూతనంగా నిర్మించిన సీసీరోడ్లు, సాక్షరభారత్ రీసోర్స్‌సెంటర్, మినీ గ్రంథాలయం, డంపింగ్ యార్డులను వారు ప్రారంభించారు.
అనంతరం లక్ష్మి నారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారతదేశంలోనే చిన్నమందడి గ్రామం ముందుండేలా అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలని అన్నారు. చిన్నమందడి గ్రామం అభివృద్ధికి ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్‌ను కోరారు. ఏడాదిలోగా చిన్నమందడి గ్రామాన్ని కలిసికట్టుగా అభివృద్ధిపర్చుకొని నిర్మల్ పురస్కార్‌ను అందుకుందామని పిలుపునిచ్చారు. చిన్నమందడి గ్రామస్తుడైన సూర్యచంద్రారెడ్డి కోరిక మేరకు తాను రెండేళ్ల కిందటే గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగిందని, ఇటీవల శ్రీమంతుడు సినిమాను చూసి కొందరు గ్రామాలను దత్తత తీసుకునేందుకు ముందుకొస్తున్నారని అన్నారు. అలా శ్రీమంతుడికి తానే స్పూర్తి అని జేడీ చెప్పకనే చెప్పినట్లయింది.